తెలంగాణ టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ గా మాజీ డీజీపీ పేర్వారం రాములును నియమించారు సీఎం కేసీఆర్. ఆయనకు కేబినెట్ హోదా కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. టీఆర్ఎస్ పొలిట్ బ్యూరో సభ్యులుగా ఉన్న పేర్వారం రాములుకు సాహిత్యం, కళలు, పర్యాటక రంగాల్లో విశేష అనుభవం ఉంది.