ఘట్కేసర్ లో ఘనంగా వికలాంగుల దినోత్సవం
ఘట్కేసర్ డిసెంబర్ 3 జనం సాక్షి ఈరోజు అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా రాష్ట్ర స్థానిక సంస్థల గౌరవ అధ్యక్షులు ఘట్కేసర్ మండల ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి ముఖ్యఅతిథిగా ఎదులాబాద్ వికలాంగుల పాఠశాల కు విచ్చేసి అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ సమాజంలో అంగవైకల్యంతో ఉన్న వారిని గౌరవించడం మన బాధ్యత కాబట్టి వారికోసం నా వంతు సహాయసహకారాలు ఎప్పుడు మీకు ఉంటాయని,కానీ వికలాంగులు మీ జీవితం అయిపోయిందని అనుకోకుండా కష్టపడి పట్టుదలతో కలెక్టర్ అయిన వాళ్ళు ఉన్నారని, క్రీడారంగంలోనూ ఎంతోమంది రాణించిన వాళ్ళు ఉన్నారని వాళ్లందర్నీ ఆదర్శంగా తీసుకొని మీరు కూడా నిరుత్సాహపడకుండా ఉన్నత స్థాయికి ఎదగాలని కోరారు. మీరు ఎప్పుడు వెనుకడుగు వేయొద్దని అన్నారు. మీకు రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని, ప్రభుత్వము ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని, ప్రభుత్వం ఇచ్చే డబుల్ బెడ్ రూమ్ లో మీకు రిజర్వేషన్ కల్పించాలని ఈ వేదిక ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న అని అన్నారు. అంగవైకల్యం ఉన్నప్పటికీ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని, కానీ కొంతమంది దివ్యాంగులు క్షణికావేశంలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని వారు ఒక్క క్షణం తనను కని పెంచిన తల్లిదండ్రులను గుర్తు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వార్డ్ మెంబర్ సురేష్, ప్రభాకర్ డిపిఎమ్స్, లత, ఏపిఎం మాధురి, మండల్ సంయుక్యత అధ్యక్షురాలు జయశ్రీ,ఎన్ హెచ్ ఈ అధ్యక్షులు రవి, దివ్యాంగులు, గ్రామస్తులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు




