13 వ ఘనంగా శ్రీకాంతా చారి వర్ధంతి వేడుకలు
శ్రీకాంతాచారి బలిదానాన్ని ప్రజలు మరువలేరు
పెద్దవంగర డిసెంబర్ 03(జనం సాక్షి )తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం మలిదశ ఉద్యమంలో తొలి అమరుడైన కాసోజు శ్రీకాంతాచారి బలిదానాన్ని ప్రజలు ఎప్పటికీ మరచిపోలేరని సర్పంచ్ వెనుకదాసుల లక్ష్మి రామచంద్రయ్య శర్మ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో విశ్వ బ్రాహ్మణ సంఘ గౌరవ అధ్యక్షులు బోగోజు భద్రయ్య చారి ఆధ్వర్యంలో శ్రీకాంతాచారి చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు . ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శ్రీకాంతాచారి మరణం తెలంగాణ మలిదశ ఉద్యమానికి ఆజ్యం పోసిందన్నారు. అగ్నికి ఆహుతవుతూ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి పడటానికి కారకుడయ్యాడన్నారు. ఆయన స్ఫూర్తితో ఉద్యమం ఎగిసి స్వరాష్ట్ర సాధనకు కారణమైందన్నారు. శ్రీకాంతాచారి త్యాగం వృథాకాలేదని పేర్కొన్నారు. ఆయన ఆశయ సాధన కోసం అందరం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలోఉపసర్పంచ్ రాము, నాయకులు మల్లికార్జున చారి, దయాకర్ రెడ్డి, చారి, శ్రీను, నాగేష్, మధు, ధర్మరపు యాకయ్య, సోమేశ్ గౌడ్, ఎంపిఒ సత్యనారాయణ,పంచాయతీ కార్యదర్శి, వెంకన్న,గ్రామ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




