భువనగిరి టౌన్ (జనం సాక్షి):–హనుమాన్ జయంతి మహోత్సవం సందర్భంగా భువనగిరి పట్టణం విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో వీర హనుమాన్ విజయత్ర బైక్ అంగరంగ వైభవంగా నిర్వహించారు. భువనగిరి పెరుమాండ్ల హనుమాన్ దేవాలయం నుండి ప్రారంభమై హైదరాబాద్ చౌరస్తా, జగదేవ్పూర్ చౌరస్తా, పాత బస్టాండ్ నుండి జగదేవపూర్ రోడ్డులో గల అంజనాద్రి హనుమాన్ దేవాలయంలో శోభ యాత్ర కొనసాగింది. దేవాలయం లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన విశ్వహిందూ పరిషత్ జాతీయ సహ కార్యదర్శి గుమ్మల సత్యం జీ మాట్లాడుతూ హిందూ సమాజం పై జరుగుతున్న దాడులను హిందూ వ్యతిరేక శక్తులను ఎదుర్కొని తిప్పి కొట్టే విధంగా యువకులు ఉండాలని కోరారు. శ్రీరామనవమి సందర్భంగా దేశవ్యాప్తంగా హిందువులపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. హిందూ సమాజంపై దాడి చేస్తే ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని హెచ్చరించారు. బజరంగ్దళ్ యాదాద్రి జిల్లా కన్వీనర్ కోకల సందీప్ మాట్లాడుతూ వీరత్వం, విశ్వరూపం చూపుదాం, పౌరుషం పరాక్రమం ప్రదర్శించుదాం అని నినాదంతో చేపట్టిన వీర హనుమాన్ విజయ యాత్రను యువకుల శక్తి ప్రదర్శనతో విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ బైక్ ర్యాలీలో యువకులు అధిక సంఖ్యలో విచ్చేసినారు . ఎండాకాలం దృష్టిలో పెట్టుకుని ప్రధాన కూడలి వద్ద మజ్జిగ ప్యాకెట్లు వాటర్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి, టీపీసీసీ డెలికేట్ మెంబర్ తంగళ్ళపల్లి రవికుమార్, మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె జహంగీర్ సత్యనారాయణ వడిచెర్ల కృష్ణ యాదవ్ ఇరుపాక నరసింహ పడిగేల ప్రదీప్ గుర్రాల శీను మనోజ్ బెండ శ్రీకాంత్ వినోద్ జిట్ట మల్లారెడ్డి,బిజెపి రాష్ట్ర నాయకుడు గూడూరు నారాయణరెడ్డి పాశం భాస్కర్, విశ్వహిందూ పరిషత్ తెలంగాణ ప్రాంత సహా కార్యదర్శి తోట భాను ప్రసాద్, జిల్లా అధ్యక్షులు పోత్నక్ రాఘవేందర్, జిల్లా కార్యదర్శి సుక్కల శ్రీశైలం, యాదవ్ జిల్లా కోశాధికారి చామ రవీందర్, ఉపాధ్యక్షులు కర్రె ప్రవీణ్ పసునూరి మనోహర్, దొంతరి నరసింహారెడ్డి, సత్సంగ్ ప్రముఖ పెద్ద గాని శ్రీనివాస్, పట్టణ అధ్యక్షులు కేమోజు మల్లికార్జున్, కార్యదర్శి సాల్వేరు వేణు, పూస శ్రీనివాస్, సహ సంయోజక్ మేకల భాను, గోరక్ష ప్రముఖ్, మార్క శ్రవణ్, నగర సంయోజక్ పొన్నాల వినయ్, భువనగిరి అంజయ్య, మయూర్ అవినాష్, నవీన్, శ్రీరామ్, శివ ప్రసాద్, మనీష్, ఉమేష్, ఉదయ్, నిశాంత్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.




