Wednesday, 4 November 2026

శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించిన సిపిఐ జాతీయ నాయకుడు చాడ.

 

 

 

 

 

 

రాజన్న సిరిసిల్ల బ్యూరో. ఏప్రిల్ 7. (జనంసాక్షి).. సిపిఐ సీనియర్ నాయకులు బూర శ్రీనివాస్ అనారోగ్యంతో కన్నుమూశారు. శుక్రవారం సిపిఐ జాతీయ నాయకులు చాడ వెంకటరెడ్డి సిరిసిల్ల పట్టణం పద్మ నగర్ లోని ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. బుర శ్రీనివాస్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. శ్రీనివాస్ పేద ప్రజల కోసం ముఖ్యంగా బీడీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పైన చేసిన పోరాటాలను గుర్తు చేశారు. శ్రీనివాస్ మృతి కార్మిక వర్గానికి తీరనిలోటని అన్నారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా నాయకులు పంతం రవి, కడారి రాములు, మంద సుదర్శన్, జాన్సన్ ఎమ్మార్పీఎస్ నాయకులు మంగలి చంద్రమౌళి తదితరులు ఉన్నారు.