ఘనంగామాజీ ప్రధానమంత్రి జయంతి వేడుకలు…
భైంసా రూరల్ డిసెంబర్ 25 జనం సాక్షి
బైంసా బిజెపి పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఆదివార0 మాజీ ప్రధానమంత్రి భారతరత్న అటల్ బిహారీ వాజ్ పేయి జయంతి వేడుకలను పట్టణంలోని సంతోషిమాత టెంపుల్ దగ్గర ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా నిర్మల్ జిల్లా భాజపా అధ్యక్షురాలు పడకండి రమాదేవి మాట్లాడుతూ… 1980 లో భారతీయ జన సంఘ్ నుంచి భారతీయ జనతా పార్టీ గా స్థాపించిన దగ్గర నుంచి ఆయన పార్టీ కోసం దేశం కోసం చేసిన అభివృద్ధి పనులను కొనియాడారు.అనంతరం నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన మన్ కి బాత్ ప్రోగ్రాం నీ కార్యకర్తలు ప్రజల తో కలిసి టీవీలో వీక్షించారు.ఈ కార్యక్రమంలో బైంసా పట్టణ అధ్యక్షుడు యానపోతుల మల్లేశ్వర్,జిల్లా ఉపాధ్యక్షులు భూషణ్,బాలాజీ పటేల్,తాలోడుశ్రీనివాస్ మరియు కౌన్సిలర్లు గౌతం పీంగ్లే, బాలాజీ సూత్ర వే,రావుల పోశెట్టి,సాహెబ్ రావు,మరియు జిల్లా ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షులు సంపత్ పటేల్, సీనియర్ నాయకులు వేణు సెట్,పురస్తు చిన్నన్న,భోజ రెడ్డి,వెంకట్రావు పటేల్,ముధోల్ అసెంబ్లీ బీజేవైఎం కన్వీనర్ అనిల్,బైంసా పట్టణం మాజీ అధ్యక్షులు నాగనాథ్,బైంసా పట్టణ ఉపాధ్యక్షులు సంతోష్ ఎర్రవర్,తిప్పోల శ్రీనివాస్,ఎస్సీ మోర్చా పట్టణ అధ్యక్షులు మారుతి,ఓబీసీ మోర్చా పట్టణ ఉపాధ్యక్షులు నారాయణ మరియు నాయకులు కార్యకర్తలు లక్ష్మణ్,రఘు పటేల్ నందు,భయ్యా,గోపాల్ భయ్యా కార్యక్రమంలో పాల్గొన్నారు.




