జాతీయస్థాయి కబడ్డీ పోటిలకు క్రీడాకారులు ఎంపిక..
ఊరుకొండ, డిసెంబర్ 25 (జనంసాక్షి):
డిసెంబర్16 నుంచి 19వరకు మంచిర్యాల జిల్లాలో జరిగిన 32వ రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలలో నాగర్ కర్నూల్ జిల్లా కబడ్డీ జట్టు తరుపున బాలుర విభాగంలో బి.ఆంజనేయులు, బాలికల విభాగంలో ఆర్.గీతిక పాల్గొని అత్యంత ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికయ్యారని జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రధానకార్యదర్శి యాదయ్య గౌడ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ క్రీడాకారులు ఈనెల 27 నుండి 30వ తేదీ వరకు బోకరో స్టీల్ సిటీ జార్ఖండ్ రాష్ట్రంలో జరగుతున్న 32వ సబ్ జూనియర్ జాతీయ స్థాయి కబడ్డీ పోటీలలో తెలంగాణ రాష్ట్ర జట్టు తరపున పాల్గొంటున్నారని పేర్కొన్నారు.
జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన క్రీడాకారులని జిల్లా కబడ్డీ అసోసియేషన్ చైర్మన్ ముచ్చర్ల జనార్ధన్ రెడ్డి, అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, కోశాధికారి సీతారాం, తదితరులు అభినందించారు.
జాతీయస్థాయి కబడ్డీ పోటిలకు క్రీడాకారులు ఎంపిక




