Thursday, 5 November 2026

హుజూర్ నగర్ లో ఎక్కడి సమస్యలు అక్కడే” తిష్ట గుంతల మయంగా, ప్రమాదకరంగా తయారైన ప్రధాన రహదారి – సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు యల్లావుల రాములు, సీనియర్ నాయకులు ఎం.వెంకటేశ్వర్లు

 

 

 

 

 

 

హుజూర్ నగర్ ఏప్రిల్ 15 (జనంసాక్షి): హుజూర్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో ఎక్కడ సమస్యలు అక్కడే తిష్ట వేసుకుని ఉన్నట్లు సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు యల్లవుల రాములు, సీనియర్ నాయకులు ఎం. వెంకటేశ్వర్లు అన్నారు. శనివారం ఇంటింటికి సిపిఐ ప్రజా చైతన్య యాత్రలో మున్సిపాలిటీ పరిధిలోని మటన్ మార్కెట్, పొట్టి శ్రీరాములు సెంటర్, గాంధీ పార్క్ ఏరియాలలో ర్యాలీ నిర్వహించి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజకవర్గ కేంద్రంలో నిలువనీడలేని బస్టాండ్ తో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అన్నారు. గుంతల మయంగా, ప్రమాదకరంగా తయారైన ప్రధాన రహదారితో ప్రజలు ఎన్నో ఇక్కట్లు పడుతున్నారన్నారు. అనేక వార్డులలో వేసవికాలం త్రాగునీరుఋ అందక పేదలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. మిషన్ భగీరథ కుళాయిలు అలంకారప్రాయంగా మారాయని విమర్శించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు తమ తీరు మార్చుకొని సిపిఐ లేవనెత్తిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పాలకూరి బాబు, కంబాల శ్రీనివాస్, దేవరం మల్లేశ్వరి, పట్టణ కార్యదర్శి గుండు వెంకటేశ్వర్లు, య ల్లావుల రమేష్, కొప్పోజుఋ సూర్యనారాయణ, జడ వెంకన్న, సోమగాని కృష్ణ, పొనుగుపాటి వాసుదేవరావు, గుండా రమేష్, జక్కుల శ్రీనివాస్, సుందరి పద్మ, కుడి తొట్టి సత్యవతి, గోపన పోయిన వెంకటేశ్వర్లు, సుశీల, పుష్ప తదితరులు పాల్గొన్నారు.