Thursday, 5 November 2026

ఘనంగా అంబేద్కర్ వర్ధంతి.

ఘనంగా అంబేద్కర్ వర్ధంతి.
నెన్నెల, డిసెంబర్ 6, (జనంసాక్షి )
నెన్నెల మండల కేంద్రంలో మంగళవారం రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ 66 వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. పంచశీల జెండా ఆవిష్కరించారు. అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి పాలాభిషేకం చేశారు. ఈకార్యక్రమంలో తెలంగాణ గ్రామీణ బ్యాంకు మేనేజర్ రాజారాం, అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు దుర్గం మల్లేష్, నాయకులు దుర్గం చక్రవర్తి, గట్టు రాజయ్య, శివలింగు, బానేష్, కృష్ణ, లింగన్న, బ్యాంకు సిబ్బంది సుదీర్, కొమురయ్య, రాజు, రాజం, వెంకన్న, నేతకానీ సంఘం నాయకులు దుర్గం మొండి, ఇస్తారీ, తదితరులు పాల్గొన్నారు.