రాజ్యాంగ నిర్మాత,డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారతీయులందరివాడు
ఏఐఎఫ్డిఎస్ వరంగల్ జిల్లా కార్యదర్శి జన్ను రమేష్
జనం సాక్షి, చెన్నరావు పేట
మండల కేంద్రంలోని జాగృతి విద్యానికేతన్ లో ఏఐఎఫ్డిఎస్ వరంగల్ జిల్లా కార్యదర్శి జన్ను రమేష్ ఆద్వర్యం లో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు.అనంతరం ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్ బాబా సాహెబ్ భీమ్ రావ్ అంబేద్కర్ ఆనాడు అనేక సమస్యలను అధిగమించి సుమారు18 డిగ్రీలు చదివిన మహాజ్ఞాని, ప్రపంచ మేధావి అయిన డాక్టర్ బీ ఆర్ అంబెడ్కర్ని ఈ రోజు కేవలం ఒక్క వర్గానికి చెందిన వ్యక్తిగా కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు, కానీ అంబెడ్కర్ అందరివాడు అని గుర్తెరగడం లేదు.SC ,ST BC మైనారిటీ ల కోసమే కాకుండా అగ్రవర్ణాల, అగ్రకులల వారి కోసం అందరికి ఉపయోగపడేలా రాజ్యాంగములో అనేక హక్కులను పొందు పొందుపరచడం జరిగింది.ఆనాడు కెవలము పురుషులకు మాత్రమే ఓటుహక్కు ఉండాలి, స్త్రీలకు ఓటు హక్కు అవసరం లేదు అన్నవారితో విబేధించి పురుషులతో స్త్రీలు సమానమే అని నినదించి స్త్రీలకు సమానత్వం కల్పిస్తూ, స్త్రీలకు కూడా ఓటుహక్కు కలిపించిన స్త్రీ అభ్యుదయవాదీ అంబెడ్కర్ అని పేర్కొన్నారు. అలాంటి మహనీయుని చరిత్రను నేటి సమాజం తెలుసుకొవలని విద్యార్థులలో దాగివున్న ప్రతిభను గుర్తించడం కోసం ఈ వ్యాసరచన పోటీలు పెట్టడం జరిగిందని అన్నారు.ఈ కార్యక్రమంలో స్కూల్ కరస్పాండెంట్ ఈగ సత్యనారాయణ,హెచ్ఎం శ్రీదేవి, ఉపాధ్యాయులు కవిత,రమ్య, సరస్వతి,మౌనిక తదితరులు పాల్గొన్నారు.బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని అన్నారు.




