సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి): జిల్లా కేంద్రంలోని శ్రీ సాయిబాబా మందిరం నందు అనఘాష్టమి వ్రతంను సోమవారం భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వలివేటి విశ్వేశ్వర శర్మ , గంగాధర శర్మ వ్రత విశిష్టతను భక్తులకు వివరించి, అనఘాష్టమి వ్రతం చేయించారు.అనంతరం వారు మాట్లాడుతూ ప్రతి మాస బహుళ అష్టమి తిథి రోజున మందిరంలో అనఘాష్టమి వ్రతంను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.పెళ్ళికాని యువతీ యువకులు, సంతానం కోసం దంపతులు, గురు బలం పెరిగేందుకు, వ్యాపార అభివృద్ధికి ఈ వ్రతం విశేష ఫలితం ఇస్తుందని తెలిపారు.11 సార్లు ఈ వ్రతమును చేస్తే కోరిన కోరిక త్వరగా నెరవేరుతుందన్నారు.భక్తులందరికీ అన్నప్రసాదాన్ని అందించారు.ఈ కార్యక్రమంలో సాయి సేవా సమితి ట్రస్ట్ అధ్యక్షులు సవరాల సత్యనారాయణ , ప్రధాన కార్యదర్శి కె. శంకర్ లాల్, కోశాధికారి జీ.మురళీకృష్ణ, రామారావు తదితరులు పాల్గొన్నారు.




