Wednesday, 4 November 2026

మైనార్టీ కార్పొరేషన్ లోన్స్ యూనిట్ పెంచాలి…

 

 

 

 

 

 

 

ఇంద్రవెల్లి ఫిబ్రవరి 13 (జనం సాక్షి)ఇంద్రవేల్లి : మైనార్టీ కార్పొరేషన్ లోన్స్ యూనిట్ పెంచాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సోమోరే నాగోరావు డిమాండ్ చేశారు. మైనార్టీ కార్పొరేషన్ లోన్స్ యూనిట్ పెంచాలని డిమాండ్ చేస్తూ సోమవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయం ఎదుట ధర్నా చేసి అనంతరం సూపర్డెంట్ వేణుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మైనారిటీ కార్పొరేషన్‌ రుణాలు మాత్రం మండలం మొత్తానికి కలిపి మూడు యూనిట్లు ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కనీసం దరఖాస్తు చేసుకున్న వారికి మండలంలో మూడు నుంచి 50 యూనిట్లు వరకు పెంచాలని కోరారు. లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో వైఎస్ఆర్ సీపీ మండల అధ్యక్షుడు మహ్మద్ ఆరిఫ్ ఫారిక్, కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు గాయక్ వాడ్ దిలిప్, నాయకులు పవార్ దుదరాం, షేక్ అంజద్, సూర్యవంశీ మధుకర్, తదితరులు ఉన్నారు