Wednesday, 4 November 2026

శ్రీ వీరభద్ర స్వామి బ్రహ్మోత్సవ సమీక్ష సమావేశం

 

 

 

 

 

 

-జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఆటంకాలు కాకూడదని అధికారులను ఆదేశించిన-శాసనసభ్యుడు డిఎస్ రెడ్యా నాయక్కురవి ఫిబ్రవరి-13/జనం సాక్షి న్యూస్: మహబూబాద్ జిల్లా కురివి మండల కేంద్రంలో మహా పుణ్యక్షేత్రమైన శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు సందర్భంగాఆధ్యాత్మికత ఉట్టి పడేలా జాతర ఏర్పాట్లు చేయాలి,భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగవద్దు శ్రీ వీరభద్ర స్వామి బ్రహ్మోత్సవాలు జాతర సమీక్ష సమావేశం లో డోర్నకల్ శాసనసభ్యులు డిఎస్ రెడ్యానాయక్. సోమవారం మండల కేంద్రము నాగుమయ్య గుడి ప్రాంగణంలో జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా జాతర ఏర్పాట్లపై అన్ని ప్రభుత్వ విభాగాల అధికారులకు పోలీస్ శాఖ, విద్యుత్,రవాణా,రోడ్డు, ఆరోగ్య,నీటి పారుదల, పంచాయతీ రాజ్,రెవెన్యూ వివిధ శాఖల దిశా నిర్దేశం చేశారు.ఈ కార్యక్రమంలో ఆర్డీవో కొమరయ్య,బిఆర్ఎస్ జిల్లా సీనియర్ నాయకులు బజ్జూరి పిచ్చి రెడ్డి, బిఆర్ఎస్ మండలం పార్టీ అధ్యక్షులు తోట లాలయ్య,బిఆర్ఎస్ యూత్ రాష్ట్ర నాయకులు గుగులోత్ రవినాయక్, వైస్ ఎంపిపి దొంగలి నర్సయ్య యాదవ్,సొసైటీ చైర్మన్ దొడ్డ గోవర్ధన్ రెడ్డి,ఆలయ కమిటీ చైర్మన్ రామునాయక్, ఆలయ అధికారి సత్యనారాయణ, సిఐ రవికుమార్, ఎమ్మార్వో ఇమ్మానుయేల్, ఎంపీడీవో సరస్వతి,ఎంపీఓ రఘుపతి రెడ్డి,యూత్ అధ్యక్షుడు రమేష్,మాజీ చైర్మన్ రాజు ఆలయ కమిటీ ధర్మకర్తమండలి సభ్యులు ఆలయ సిబ్బంది, వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు,అధికారులు,బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.