Tuesday, 3 November 2026

ఘనంగా అల్లూరి సీతారామరాజు 116వ జయంతి

హైదరాబాద్‌ : మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 116వ జయంతిని అల్లూరి సీతారామరాజు స్మారకసమితి, క్షత్రియ సేవా సమితి ఘనంగా నిర్వహించింది. ట్యాంక్‌బండ్‌పై ఉన్న అల్లూరి విగ్రహానికి జూబ్లిహిల్స్‌ ఎమ్మెల్యే విష్ణువర్థన్‌రెడ్డి, ఎమ్మెల్సీ పద్మరాజు తదితరులు పూలమాల వేసి నివాళులర్పించారు. అంగ్లేయుల నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం చేసిన మహావ్యక్తి అల్లూరి అని నేతలు కొనియాడారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే విష్ణు, సమితి నాయకులు పేద విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు పంపిణీ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *