Tuesday, 3 November 2026

మేక వనం పల్లి పిఎసిఎస్ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు డిసిసిబి డైరెక్టర్ పట్లోళ్ల అంజిరెడ్డి

మోమిన్ పేట జూన్ 2 జనం సాక్షి
తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు పురస్కరించుకొని మోమిన్ పేట మండలంలోని మేక వనం పల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం అంగరంగ వైభవంగా జాతీయ పతాకాన్ని ఎగురవేసి సంబరాలు జరుపుకున్నారు పిఎసిఎస్ చైర్మన్ డిసిసిబి డైరెక్టర్ పట్లోళ్ల అంజిరెడ్డి ఆధ్వర్యంలో మేక వనంపల్లి సహకార సంఘంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం శుక్రవారం ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా డిసిసిబి డైరెక్టర్ పట్లోళ్ల అంజిరెడ్డి మాట్లాడుతూ సహకార సంఘం బలోపేతానికి పాలకవర్గ సభ్యులు సంఘ సభ్యులు అందరి సహకారంతోనే సహకార సంఘాన్ని బలోపేతం చేయడం జరుగుతుందని ఆయన అన్నారు సంఘంలో ఉన్న సభ్యులందరూ సకాలంలో రుణాలు చెల్లించి మిగతా వారికి రుణాలు ఇచ్చే విధంగా సహకారం అందించాలన్నారు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తరతరాలుగా ఉద్యమాలు చేసినప్పటికీ తెలంగాణ రాలేకపోయిందని కెసిఆర్ దీక్ష ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం సాధ్యమైందని ఆయన అన్నారు తెలంగాణ జాతిపిత ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ వైస్ చైర్మన్ వినయ్ కుమార్ డిసిసిబి బ్యాంక్ మేనేజర్ నారాయణరెడ్డి సీఈఓ బాలకృష్ణ ఆయా గ్రామాల సర్పంచులు సహకార సంఘ పాలకమండలి సభ్యులు రైతులు తదితరులు పాల్గొన్నారు