ఘనంగా ఇందిరాగాంధీ జయంతి వేడుకలు
కొడకండ్ల, నవంబర్19( జనంసాక్షి ):
భారతదేశ మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరా గాంధీ జయంతి వేడుకలు శనివారం రోజున కొడకండ్ల మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా మండల అధ్యక్షులు ధరావత్ సురేష్ నాయక్,కాంగ్రెస్ నాయకులు శ్రీమతి ఇందిరా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా సురేష్ నాయక్ మాట్లాడుతూ భారతదేశపు మొట్టమొదటి మహిళా ప్రధాన మంత్రి శ్రీమతి ఇందిరా గాంధీ అని, స్త్రీలకు గౌరవం తెచ్చే విధంగా ప్రపంచ సమాజంలో,ముఖ్యంగా మహిళా సాధికారత సంస్థ నుండి అపారమైన గౌరవాన్ని పొందరాని, భూ సంస్కరణ చట్టం తీసుకోచ్చి, పేద ప్రజలకు ఇందిరమ్మ ఇండ్లు కట్టించారాని అలాగే గరిభి హఠవో నినాదంతో పేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకు చేసిన ప్రయత్నం ఇప్పటికి మర్చిపోమని గుర్తుచేసారు, రాజకీయాల్లో కొత్తదనం చూపించి దీరత్వానికి మారు పేరుగా నిలిచిన మహా నాయకురాలు ఇందిరా గాంధీ అని, పాలనా అంటే ఇందిరమ్మ రాజ్యంలా ఉండాలన్నంతగా జనరంజకపాలన చేసి ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్న మహా నేత అని వారు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి నూనె ముంతల సోమ నరసయ్య, కొడకండ్ల పట్టణ అధ్యక్షులు మసురం రవీందర్, మండల ప్రధాన కార్యదర్శి మురారిశెట్టి అంజయ్య, మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు ధర్మారపు బిక్షపతి, మండల బీసీ సెల్ అధ్యక్షులు వల్లబోజు రమేష్, మండల మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎండి కలీం, మసురం మనోహర్, జాటోత్ రాము నాయక్ మండల కార్యదర్శి ఐతరాజు మండల ఎస్సీ సెల్ నాయకులు జక్కుల సంజీవ, దోర్నం సోమయ్య, రంగయ్య శ్రీనివాస్, అందె బయన్న, నజీర్, ఉల్లి ఆంజనేయులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు,కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.




