Thursday, 5 November 2026

నందివనపర్తి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన జిల్లా అదనపు డి ఆర్ డి ఓ జంగారెడ్డి

నందివనపర్తి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన జిల్లా అదనపు డి ఆర్ డి ఓ జంగారెడ్డి

రంగారెడ్డి, ఇబ్రహీంపట్నం,(జనంసాక్షి):- యాచారం మండల పరిధిలోని నందివనపర్తి ధాన్యం కొనుగోలు కేంద్రం లో జరిగిన మోసం పై ఈ నెల 15 న గ్రామ రైతులు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేయడం జరిగింది ఈ మేరకు కలెక్టర్ ఆదేశాలతో శనివారం నందివనపర్తి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా అదనపు డి ఆర్ డి వో జంగా రెడ్డి మండల ఏ పి ఎమ్ సతీశ్ సందర్శించడం జరిగింది అనంతరం కొనుగోలు కేంద్రం కవద్ద ఉన్న రైతులను వద్దనుండి వివరాలు సేకరించారు ఈ సందర్భంగా తాలు ఎక్కువగా ఉన్న రైతుల అంగీకారం తో నే 42 కిలోలు తూకం వేస్తున్నట్టు తెలిపారు తేమ శాతం తక్కువగా ఉన్న రైతుల వద్ద 41 కిలోలు తూకం వేయాలని ఈ సందర్భంగా తెలిపారు ఈ సందర్భంగా కొనుగోలు కేంద్ర ఇంచార్జి స్వరూప మాట్లాడుతూ తాను నిబంధనల ప్రకారమే కొనుగోలు చేస్తున్నానని తనపై కొంతమంది తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు