Tuesday, 3 November 2026

వికారాబాద్ ప్రాంతంలో నువ్వంటే నువ్వు పోటాపోటీగా సాగుతున్న రాజకీయాలు గెలుపే 2023 లక్ష్యంగా పనిచేస్తున్న వివిధ పార్టీల నాయకులు

 

 

 

 

 

 

 

 

వికారాబాద్ రూరల్ ఏప్రిల్ 26 (జనం సాక్షి)వికారాబాద్ నియోజకవర్గంలో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్ టిఆర్ఎస్ బిజెపి బి ఎస్ పి 2023 ఎన్నికల్లో సత్తా చాటాలని లక్ష్యంగా పనిచేస్తున్నాయి ప్రధానంగా జాతీయ పార్టీ అయిన బిజెపి ఒకప్పుడు ఓటు బ్యాంకు లేకున్నా మాజీ మంత్రి చంద్రశేఖర్ పార్టీలో చేరిన తర్వాత బిజెపి కి బలం చేకూరింది బహుజన సమాజ్ పార్టీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నాయకత్వం లో గ్రామాల్లో విస్తరించి రాజ్యాధికారం సాధించాలని లక్ష్యంతో గొర్ల కాడి క్రాంతి కుమార్ జిల్లా బిఎస్పి అధ్యక్షునిగా పనిచేస్తూ వికారాబాద్ నియోజకవర్గంలో గ్రామ గ్రామాల్లో పర్యటిస్తూ యువతీ యువకులను ఆదుకుంటూ చాప కింద నీరుల అన్ని పార్టీలకు తలనొప్పిగా మారారు పార్టీని నమ్ముకుని పనిచేస్తున్నారు అధికార బి ఆర్ఎస్ పార్టీ ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ మెతుకు ఆనంద్ మరియు వడ్ల నందు ఇద్దరు కూడా ధరూర్ మండలానికి చెందిన నాయకులే గత ఎన్నికల్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మద్దతు తో డాక్టర్ మెతుకు ఆనంద్ కు టికెట్ కేటాయించి గెలిపించుకున్నారు ప్రస్తుతం వడ్ల నందు కూడా కార్పొరేషన్ చైర్మన్ బాలమల్లు కేటీఆర్ అండ్ జనరల్ తో టిఆర్ఎస్ తరఫున పోటీలో ఉండేందుకు సిద్ధపడుతున్నారు వడ్ల నందు ఫౌండేషన్ అనేక కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లోకి దూసుకెళ్తున్నారు ద్వారా తుప్ప ఆనంద్ కూడా మోమిన్ పేటవాసి ది లైట్ ఫౌండేషన్ ద్వారా రక్తదాన శిబిరాలు క్రీడా పోటీలు డప్పు దరువు కార్యక్రమం తో నిరుపేదల నిరుపేద ప్రజలకు సహాయపడుతూ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు తుప్ప ఆనంద్ తండ్రి తుప్ప రామయ్య మోమిన్ పేట సర్పంచిగా ఉండి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం వల్ల మోమిన్ పేట మర్పల్లి బంటు వారం వికారాబాద్ ప్రాంతాల్లో అనేక పలుకుబడి ఉండి ప్రజల్లోకి దూసుకుపోతున్నారు జడ్పీ చైర్ పర్సన్ సునీత మహేందర్ రెడ్డి మాజీ మాజీ మంత్రి ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి అండదండలతో బి ఆర్ఎస్ టికెట్ ఆశిస్తున్నారు ఈసారి ఎలాగైనా బి ఆర్ఎస్ పార్టీ టికెట్ సంపాదించి పంతం నెగ్గించు కోవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు ఇదిలా ఉండగా బి ఆర్ఎస్ పార్టీలో టిక్కెట్ పై ఆశిస్తున్న వారి సంఖ్య ముగ్గులు అని తేలింది బి ఆర్ఎస్ పార్టీలో శ్రీముఖ పోటీ తప్పదని ప్రజలు భావిస్తున్నారు జాతీయ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదులో దూసుకుపోతూ హార్ట్ సే హాత్ మిలాహో కార్యక్రమంతో గ్రామ గ్రామాల్లో ప్రజల ఆశీర్వాదాలు పొందుతూ ముందుకు సాగుతున్నారు మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ ఎలాగైనా గెలిపించి తీరుతామని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు నియోజకవర్గంలో మర్పల్లి వికారాబాద్ మోమిన్ పేట బంట్వారం కోటపల్లి ధరూర్ మండలాలు ఉన్నాయి ప్రతి మండలంలో ఆయన అనుచరగణం ఇతర పార్టీలో ఉంటూ ఆయనకు అనుకూలంగా పనులు చేసి పెడుతున్నారు దీనికితోడు టిఆర్ఎస్ పార్టీ కి చెందిన ఎమ్మెల్యే డాక్టర్ ఆనంద్ వలసవాదుల కి ప్రాధాన్యత ఇస్తూ ఆవిర్భావం నుంచి పనిచేసిన కార్యకర్తలను పట్టించుకోకపోవడంతో కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు ముఖ్యంగా వికారాబాద్ ప్రాంతంలో టిఆర్ఎస్ జండా పట్టింది చంద్రశేఖర్ అని ఆయన ఏ పార్టీలో ఉన్న ఆయన వెంట నడుస్తానని టిఆర్ఎస్ నాయకులు సైతం బహిరంగంగానే చెప్పుకుంటున్నారు ఇదేవిధంగా ప్రజలందరికీ చేరువలో ఉంది ప్రజాసేవ కోసం కృషి చేస్తున్నా మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ తనదైన శైలిలో ప్రతి ఒక్కరిని కలుపుకొని పార్టీని ముందుకు తీసుకెళుతున్న ఈ ప్రాంతంలో అందరి కంటే మంచి పట్టున్న రాత్రి ఒక ప్రసాద్ కుమార్ మరియు చంద్రశేఖర్ అని చెప్పవచ్చు రైతుబంధు సంబరాలు చేస్తూ మీతో నేను కార్యక్రమం అంటూ ప్రజల దగ్గరకు చేరుకోవడం కోసం అనేక ప్రయత్నాలు టిఆర్ఎస్ టిఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ మీతో నేను కార్యక్రమం చేపట్టినప్పటికీ నాయకులు మాత్రమే అసంతృప్తిగానే ఉన్నారు ఏమాత్రం అభివృద్ధి పనులు చేయకుండా ప్రచారాల కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రయోజనమేమిటి పలువురు ప్రశ్నిస్తున్నారు వికారాబాద్ ప్రాంతంలో 25 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసిన డాక్టర్ చంద్రశేఖర్ అంటే ప్రతి ఒక్కరూ గుర్తిస్తారు మారుమూల గ్రామాల్లో చంద్రశేఖర్ ప్రసాద్ కుమార్ చేసిన అభివృద్ధి పనులు కనిపిస్తాయని పలువురు పేర్కొంటున్నారు ఏదిఏమైనా వికారాబాద్ 2023 ఎన్నికల్లో బీజేపీకి కాంగ్రెస్ పార్టీకి పోటీ ఉంటుంది పలువురు అంచనాలు వేస్తున్నారు ప్రాంతంలో బీజేపీ పాగా వేయడం ఖాయమని ఆ పార్టీ నాయకులు దీనికి తోడు వైయస్సార్ తెలంగాణ పార్టీ తరఫున ఆ పార్టీ నేత ఉప్పరి రమేష్ ఎల్లప్పుడూ ప్రజల్లో ఉంటూ ప్రజాసేవలు చేస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి తనదైన శైలిలో ప్రయత్నాలు చేస్తున్నారు వైఎస్ షర్మిల నాయకత్వంలో ఏ పిలుపు ఇచ్చిన వెంటనే స్పందించి పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకు పోతున్నారు పేర్కొంటున్నారు