: శామీర్ పేట్, జనం సాక్షి :గాంధీ భవన్ లో జరిగిన ఈద్ మిలాప్ కార్యక్రమం లో శామీర్ పేట నుండి ఆహ్వానం మేరకు కేసిఆర్ సేవాదళం రాష్ట్ర కార్యదర్శి బిఆర్ఎస్ జిల్లా నాయకులు మహ్మద్ అఫ్జల్ ఖాన్, మహ్మద్ గౌస్ లు పాల్గొన్నారు. ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా ఇఫ్తిఖార్ హుస్సేన్ ముఖ్య అతిథిగా హాజరు కాగా అఫ్జల్ ఖాన్ ను విశేష అతిథి గా పరిగణించి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆర్టిస్టులు పాత, కొత్త హిందీ పాటలను పాడారు. ఈ సందర్భంగా అఫ్జల్ ఖాన్ మాట్లాడుతు.. జునేద్ అధ్వర్యంలో లో జరిగిన ఈ కార్యక్రమంలో అందరు ఎంతో ఆప్యాయంగా ఆహ్వానించారని,పాటల తో ఎంత గానో మంత్ర ముగ్ధులు చేశారని అన్నారు. పాటలు పాడిన ఆర్టిస్టులకు, కార్యక్రమం నిర్వహించిన వారికి అఫ్జల్ ఖాన్ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమం లో అఫ్జల్ ఖాన్ తో పాటు , కార్యక్రమం నిర్వాహకులు జునేద్, బిఆర్ఎస్ సినీయర్ నాయకులు సత్తార్ గుల్షని, ప్రిన్స్ అలీ, మహ్మద్ గౌస్, నసీర్, తదితరులు పాల్గొన్నారు
ఘనంగా ఈద్ మిలాప్ దినోత్సవ వేడుకలు




