కంటోన్మెంట్ జనం సాక్షి జూలై 02 ప్రముఖ ఓఈఎమ్ ఎన్విరాన్‌మెంటల్ ఫ్రెండ్లీ (పర్యావరణహిత) ప్రీమియం ఎలక్ట్రిక్ ఫోల్డబుల్ సైకిళ్ల పరిశ్రమలో అగ్రగామి అయిన స్విచ్ బైక్ ఆధ్వర్యంలో నగరం వేదికగా ఈరోజు తమ రెండవఎక్స్‌క్లూజివ్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను ప్రారంభించింది. గుజరాత్‌కు చెందిన ఈవీ బ్రాండ్ స్విచ్ బైక్ మాదాపూర్‌లోని ఎస్‌జీ ఆటోమోటివ్స్ నుంచి తమకార్యకలాపాలను మరింతపెంచుతోంది,అంతేకా కుడా ఈ నూతన స్టోర్ వేదికగా వినియోగదారులు స్విచ్ బైక్‌ను స్వయంగా నడిపిఅనుభూతిని పొందే అవకాశాన్ని కల్పిస్తుంది.బేగంపేటలో ఎమ్‌వి ఆటోమొబైల్స్‌ను విజయవంతంగా ప్రారంభించిన రెండున్నర నెలల్లోనే ఈ ఎక్స్‌పీరియన్స్ షోరూంను కూడా నేటి నుంచి ప్రజల కోసం అందుబాటులోకి తీసుకువచ్చింది.హైదరాబాద్‌లో నూతనంగా ప్రారంభించిన ఎస్‌జీ ఆటోమోటివ్స్ స్విచ్ బైక్ ఎక్స్‌పీరియన్స్ షోరూమ్., హైటెక్ సిటీతో పాటు పరిసర ప్రాంతాల్లోని ఎలక్ట్రిక్ వాహాన(ఈవీ) ప్రియులందరూ స్వయంగా పరీక్షించి,అస్వాదించడం కోసం రూపొందించబడింది. స్విచ్ బైక్ ఆధ్వర్యంలోని ఎలక్ట్రిక్ సైకిళ్లను ఔత్సాహికులు ప్రత్యక్షంగా పరీక్షించడమే కాకుండా ఫాస్ట్ డెలివరీ కోసం కొనుగోలు చేసే అవకాశాన్ని కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు.ఈ ప్రారంభోత్సవం సందర్భంగా స్విచ్ బైక్ వ్యవస్థాపకులు, ఎమ్‌డీ రాజ్‌కుమార్ పటేల్ మాట్లాడుతూ తమ సంస్థ గత కొన్ని నెలలుగా పురోగతి దిశలో ప్రయాణిస్తుందనితెలిపారు.దేశంలోని ప్రతి ఇంటికి స్విచ్ బైక్‌ను డెలివరీ చేయడానికి అనుకూలంగా భారత్ అంతటా నూతన షోరూంలను ఏర్పాటు చేస్తున్నామనిఅన్నారు.ప్రధానంగా భారత్‌లో హైదరాబాద్ నగరం ఈవీ హబ్‌గా అవతరిస్తోంది. స్విచ్ బైక్ పై హైదరాబాద్ ప్రజలు చూపిస్తున్న ప్రేమాదరణ, మద్దతు తమకు మిక్కిలీ సంతోషంతో పాటు ప్రోత్సాహాన్ని అందిస్తుందని అన్నారు.స్విచ్ ఎలక్ట్రిక్ బైక్ అసాధారణమైన ప్రేక్షకాదరణ పొందుతూ మరింత వేగంగా విస్తరిస్తుంది. ఈ పరిణామం తమ ప్రయత్నానికి సంస్థ ప్రయాణానికి అభివృద్ధి సూచికని ఒక వ్యవస్థాపకుడిగా దృఢంగానమ్ముతున్నానని పేర్కొన్నారు.స్విచ్ బైక్ ఎక్స్‌పీరియన్స్ స్టోర్ అనేది హై-ఎండ్ ఎక్స్‌పీరియన్స్ షోరూమ్ కంటే ఉన్నతమైనది.ఇది సైక్లింగ్ కమ్యూనిటీ నిరంతరం ప్రోత్సహించడానికి ఒక స్థిరమైన వేదికగా పనిచేస్తుంది.కస్టమర్‌లు తమ అవసరాలకు తగినట్లుగా సదుపాయాలను పొందే అవకాశం అందుబాటులో ఉంటుంది. ఎస్‌జీ ఆటోమోటివ్స్‌కు అధిపతిగా ఉన్న గణపత్ సర్వీ, పీ.కిషన్ గోపాల్ హైదరాబాద్ లో స్విచ్ బైక్‌లు అందించే ప్రత్యేక డీలర్‌లుగానూ సేవలందిస్తారు.పర్యావరణ రహిత ప్రభావాన్ని తగ్గించడంతో పాటుగా అర్బన్ మొబిలిటీపై ఆదరణ పెరిగేలా విప్లవాత్మక మార్పు కోసం పాటుపడుతున్న స్విచ్ మిషన్‌కు ‘హైదరాబాద్‌లో స్విచ్ బైక్ సేవలు విస్తరించడం అనుకూల పరిణామంగా ప్రధానమైన దశగా మారింది. నాణ్యత విషయంలో నిబద్దతతో ముందుకు సాగుతున్న స్విచ్ బైక్ ఎలక్ట్రిక్ సైకిల్ పరిశ్రమలో అగ్రగామిగా గుర్తింపు పొందింది.భవిష్యత్ రవాణా సేవలన్నీ ఎలక్ట్రిక్ వాహానాలపైనే ఆధారపడతాయని ప్రగాఢంగానమ్ముతున్నామని స్విచ్ బైక్ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ చింతన్ ఖత్రీ తెలిపారు.హైదరాబాద్‌లో తమ రెండవ ఎక్స్‌పీరియన్స్ షోరూం అడ్రస్ హెచ్:నెంబర్ 2-52/1/1,యూనిట్1,జి +1ఫ్లోర్,బాటా స్టోర్ పక్కన మాదాపూర్ హైదరాబాద్, తెలంగాణ లోస్టోర్‌ని ప్రారంభించడం వలన ప్రజలు ప్రీమియం ఎలక్ట్రిక్ సైకిళ్లను కొనుగోలు చేయడాన్ని మరింత సులభతరం చేస్తున్నామని అంతేకాకుండా వారి రైడింగ్ ఆనందాన్ని మళ్లీ ఆవిష్కరిస్తున్నామన్ని తెలియజేశారు.
హైదరాబాద్ వేదికగా ప్రీమియం ఈవీ బ్రాండ్ స్విచ్ బైక్ మరో ఎక్స్‌పీరియన్స్ షోరూం ప్రారంభం




