Tuesday, 3 November 2026

వికారాబాద్ ప్రాంతంలో బి ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి సునాయాసంగా గెలవాలంటే డాక్టర్ తుప్ప ఆనంద్ కు టికెట్ కేటాయించాలి

వికారాబాద్ రూరల్ జూలై 2 (జనం సాక్షి)వికారాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో బి ఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సునాయాసంగా విజయం సాధించాలంటే ది లైట్ ఫౌండేషన్ చైర్ పర్సన్ డాక్టర్ తుప్ప ఆనంద్ టికెట్ కేటాయించాలని మాదిగ జేఏసీ జిల్లా చైర్మన్ రాజు దళిత ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఎస్ నర్సింలు లు బి ఆర్ఎస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ కు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు వారు సూచించారు శుక్రవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలో బి ఆర్ ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడుతూ వికారాబాద్ ప్రాంతంలో బి ఆర్ఎస్ పార్టీకి గత పది సంవత్సరాలుగా సేవలందిస్తున్న జిల్లా డాక్టర్ జేఏసీ చైర్మన్ గా ది లైట్ ఫౌండేషన్ చైర్ పర్సన్ గా బి ఆర్ఎస్ పార్టీ అభివృద్ధి కోసం సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న వ్యక్తి డాక్టర్ తప్ప ఆనంద్ అని వారన్నారు వికారాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో నీ మోమిన్ పేట మర్పల్లి ధరూర్ కోటిపల్లి బంటారం మండలాల్లో మంచి పేరున్న వ్యక్తి డాక్టర్ తప్ప ఆనంద్ అని అన్నారు డాక్టర్ తప్ప ఆనంద్ తండ్రి స్వర్గీయ తుప్ప రామయ్య మోమిన్ పేట సర్పంచిగా మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షునిగా పనిచేసే ప్రజాదరణ పొందిన తెలంగాణ ఉద్యమంలో మాజీ ముఖ్యమంత్రి మాజీ గవర్నర్ డాక్టర్ మర్రి చెన్నారెడ్డి తో కలిసి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు యలిదశ ఉద్యమంలో కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో సకలజనుల సమ్మె నియోజకవర్గంలో పాదయాత్రలు వంటి కార్యక్రమాలు చేసిన తెలంగాణ ఉద్యమకారుడు స్వర్గీయ తుప్పరామయ్య అని వారు కొని యాడారు డాక్టర్ తుప్ప ఆనంద్ కూడా కేసీఆర్ ఇచ్చిన ప్రతి పిలుపును స్పందించి తెలంగాణ కోసం పని చేసిన డాక్టర్ జేఏసీ చైర్మన్ దిలైట్ ఫౌండేషన్ చైర్ పర్సన్ తప్ప ఆనంద బి ఆర్ఎస్ పార్టీ టికెట్ ఇస్తే మర్పల్లి బంటు వారం కోటపల్లి మోమీన్ పేట ధరూర్ వికారాబాద్ మండలం వికారాబాద్ మున్సిపాలిటీలలో బాగా పేరు ఉన్న ప్రముఖ వైద్యులు డాక్టర్ తప్ప ఆనంద్ అని వారి పేర్కొన్నారు ఈ ప్రాంతంలో టిఆర్ఎస్ అభ్యర్థి గెలవాలంటే డాక్టర్ తప్ప ఆనంద్ కే టికెట్ కేటాయించాలని వారు అధిష్టానం వర్గాన్ని సూచించారు లేని పక్షంలో బి ఆర్ఎస్ పార్టీ ఓటమికి కారణం ఆదిష్టానవారిగమే బాధ్యత వహించాల్సి వస్తుందని వారు హెచ్చరించారు