Wednesday, 4 November 2026

ఘనంగా ఈస్టర్ పండుగ వేడుకలు

 

 

 

 

పెన్ పహాడ్ ఏప్రిల్ 09 (జనం సాక్షి) : మండల కేంద్రంతోపాటు మండలంలోని వివిధ గ్రామాల్లో పలు మినిష్ట్రీస్, చర్చిల్లో ఆదివారం ఈస్టర్ పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు, ఈ సందర్బంగా మండల పరిధిలోని నాగులపాటి అన్నారం ఆరాధ్య గ్లోబల్ మినిస్ట్రీస్, అన్నారం బ్రిడ్జి తెలుగు బాప్టిస్ట్ చర్చి లోని దూపహాడ్ గ్రామంలోని తెలుగు బాపిస్ట్ చర్చ్,పెన్ పహాడ్ లోని తెలుగు బాప్రిస్ట్ చర్చ్, లింగాల గ్రామంలోని వివిధ చర్చిల్లో, చీదేళ్ల గ్రామంలోని పొడపంగి సునీల్ బాబు, కోరే దేవదనం, మీసాల ప్రేమ్ కుమార్, రాములు, మీసాల పవన్, పెనుయేలు చర్చిల్లో పాస్టర్లు ఇమ్మనియేలు, జె జె సామెల్, యేసుక్రీస్తు పునరుద్ధానం గురించి క్రైస్తవులకు బోధించారు అనంతరం కేక్ కట్ చేసి పంపిణి చేశారు అంతకుముందు ఏసుక్రీస్తు కీర్తనలను ఆలాభించారు అనంతరం ప్రేమ విందును స్వీకరించారు, ఈ కార్యక్రమంలో క్రైస్తవులు ఓగ్గు సామెల్ సుధా, పొడపంగి శోభారాణి, ప్రవీణ్, మధు, రవి, కిరణ్, నవీన్, సామేలు, మట్టయ్య నరసయ్య, జయమ్మ, తదితరులు పాల్గొన్నారు…