Wednesday, 4 November 2026

మానుకోట జిల్లా బధిరుల సాంఘం ఎన్నికలు ఏకగ్రీవం

 

 

 

 

మహబూబాబాద్ బ్యూరో-ఏప్రిల్10(జనంసాక్షి)మహబూబాబాద్ జిల్లా బధిరుల(డఫ్ అండ్ డమ్) సంఘం 2023-2026 నాటికి ఎన్నికలు ఆదివారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించగా ఆ సంఘం అధ్యక్షునిగా పి. మహేష్, ఉపాధ్యక్షునిగా ఎం. రమేష్, కార్యదర్శిగా టి. అనిల్, కోశాధికారిగా బి. పృద్విరాజ్, ఆటల కార్యదర్శిగా ఏ,రాజు లు ఎన్నిక కాగా కార్యవర్గ సభ్యులుగా టి వేణు,ఎస్ నరేష్, టి రవి లు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ఎన్నికల పరిశీలకులు ఎన్ అనీల్ కుమార్ తెలిపారు. మాటలు రాక, చెవులు వినిపించక బధిరులు సమాజంలో ఎదురుకుంటున్న సమస్యలపై పోరాటం చేస్తూ వారికి ఈ నాయకులు అండగా నిలవాలని ఆయన కోరారు. బధిరులను గుర్తించి ప్రభుత్వం వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించి వారిని ఆదరించాలని ఎన్నికైన నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.