ఘనంగా ఉల్లాఖాన్ వర్ధంతి వేడుకలు :శామీర్ పేట్, జనంసాక్షి :
సోమవారం శామీర్ పేట లో భారత స్వాతంత్ర్య సమర యోధులు అశ్ఫాఖ్ ఉల్లా ఖాన్ 95వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అఫ్జల్ ఖాన్ మాట్లాడుతు.. భారత స్వాతంత్ర్య సమరం లో ఆయన పాత్ర మరువలేనిదని యువత అశ్ఫాఖ్ ఉల్లా ఖాన్ గారి ఆశయాలు అనుసరించి భారత దేశ సేవలో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అఫ్జల్ ఖాన్ తో పాటు టీఆర్ఎస్ నాయకులు వంగ వెంకట్ రెడ్డి కేసిఆర్ సేవాదళం మేడ్చల్ జిల్లా కార్యదర్శి పి నర్సింహ రెడ్డి, వార్డు సభ్యులు దూడల శ్రీకాంత్ గౌడ్, నవీన్ ముదిరాజ్, టీఆర్ఎస్ నాయకులు బత్తుల శశికాంత్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
19ఎస్పీటీ -1: నివాళులు అర్పిస్తున్న నాయకులు
ఘనంగా ఉల్లాఖాన్ వర్ధంతి వేడుకలు




