బెల్లంపల్లి, జనవరి 18, (జనంసాక్షి )
బెల్లంపల్లి పట్టణంలో బుధవారం మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీఆర్ 27వ జయంతి వేడుకలను తెలుగు దేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం అమ్మ అనాధ ఆశ్రమంలో 25 కిలోల బియ్యం, నిత్యావసర సరుకులు, కూరగాయలు, పండ్లు అందజేశారు. ఈసందర్భంగా ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు పున్నం చందర్ మాట్లాడుతూ ఎన్టీఆర్ సినిమా హీరో గానే కాకుండా తెలుగుదేశం పార్టీని పేద, బడుగు, బలహీన వర్గాల పార్టీగా ముద్ర వేసుకొని కాంగ్రెస్ పార్టీని మట్టికరిపించి అధికారంలోకి రావడం ఎన్టీఆర్ కృషి, పట్టుదల కారణం అన్నారు. రెండు రూపాయలకే కిలో బియ్యం, మద్యపాన నిషేధం లాంటి కార్యక్రమాలతో పేదల దైవంగా ఎన్టీఆర్ నిలిచారన్నారు. అనేక సంక్షేమ కార్యక్రమాలు, ఒక్క రూపాయి మాత్రమే జీతం తీసుకున్న సీఎం గా ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేశారని చెప్పారు. ఈకార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు సింహాద్రి, టిఎన్టీయూసీ ప్రధాన కార్యదర్శి ఠాకూర్ మణిరామ్ సింగ్, పట్టణ ఉపాధ్యక్షుడు గద్దల నారాయణ, నాయకులు బొల్లు మల్లయ్య, హరికిషన్ పాండే, ఎండి హాసన్, అంతం శంకరయ్య, సిహెచ్ రమేష్, జి సదానందం, ఎండి అన్వర్, గంగాధర్ గౌడ్, రహిమాతున్నిసా బేగం తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా ఎన్టీఆర్ వర్ధంతి.




