ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించిన
– డోర్నకల్ నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ ధరావత్ వెంకటేష్ నాయక్
కురివి జనవరి18: జనం సాక్షి న్యూస్:తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్ష్లులు స్వర్గీయ నందమూరి తారక రామారావు 27వ వర్దంతి సందర్బంగా బుధవారం కురవి మండలం బాలపాల గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూల మాలలు వేసి ఘన నివాళులర్పించిన తెలుగుదేశం పార్టీ డోర్నకల్ నియోజకవర్గం ఇంచార్జ్ ధరావత్ వెంకటేష్ నాయక్. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ వర్ధంతి ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నియోజకవర్గ ఇన్చార్జ్ ధరావత్ వెంకటేష్ నాయక్ పాల్గొని నివాళులర్పించారు. ఈ సందర్భంగాఆయన మాట్లాడుతూ నందమూరి తారక రామారావు సామాన్య ప్రజలకు పేదలకు బడుగు బలహీన వర్గాలకు రాజకీయ నాయకులుగా తీర్చిదిద్దిన ఘనత ఎన్టీ రామారావు దేేే అన, పటేల్ పట్వారి వ్యవస్థను నిర్మూలించి దొరతనాన్ని ఉక్కు పాదంతో అణిచివేసి ప్రతినిత్యం ప్రజల అవసరాలు తెలుసుకొని అభివృద్ధి దిశలో నడిపిన ఏకైక ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు డాక్రా మహిళా సంఘాలకు నాంది పలికి మహిళలంటే ఆదిపరాశక్తి మహిళలకు ప్రతి రంగంలో 50 శాతం రిజర్వేషన్ ఉండాలి ప్రతి రంగంలో ముందుండాలి అని మహిళలను ప్రోత్సహించిన మహా యోధుడు ఆడబిడ్డకు తన పుట్టిన ఇంట్లో తన అన్నదమ్ములతోపాటు తనకు కూడా సమానమైన ఆస్తిపస్తులు వచ్చే విధంగా జీవో అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఎన్టీఆర్, రైతులు బావులకాడ మోటలు తోలి పంటలు పండిస్తుంటే వారి బాధలు చూడలేక రైతులకు కరెంటు మోటర్లు సాంక్షన్ చేసి బావుల కాడికి కరెంటు లైన్లు తీసుకువచ్చిన ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అని ఆయన అన్నారు. అదేవిధంగా రెండు రూపాయల కిలో బియ్యం కట్టుకోవడానికి బట్టలు సంక్షేమ పథకం మొట్టమొదలు ప్రవేశపెట్టిన మహోన్నత వ్యక్తి ప్రభుత్వ సారాయిని ముక్కు పాదంతో అణిచివేసి పూర్తిగా నిర్మూలించిన మహనీయుడు ముఖ్యమంత్రి గా నెలకు 1, రూపాయి జీతం తీసుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించిన ఏకైక ముఖ్యమంత్రి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు హైదరాబాదును హైటెక్ సిటీగా డెవలప్మెంట్ చేసి నేటి యువత కోసం ఐటీ రంగ సంస్థలను ఫార్మా సంస్థలను నెలకొల్పిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఖమ్మం బహిరంగ సభ తో తెలుగుదేశం పార్టీ పూర్వ వైభవం వస్తుందని ప్రతి ఒక్క కార్యకర్త తెలుగుదేశం పార్టీ వైపు చూస్తూ ఎప్పుడెప్పుడు ఎలక్షన్ వస్తుందా రెక్కలు వచ్చిన పక్షుల సొంత గూటికి చేరుదామా అన్న విధంగా ఉర్రూతలూగుతున్న యువ నేతలు తెలుగుదేశం పార్టీ నాయకులు ఖమ్మంలో బహిరంగ సభను చూసిన ప్రతిపక్ష నాయకులు అటు ఆంధ్రప్రదేశ్ వైస్సార్ పార్టీ నాయకులు ఇటు తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు దడ పుట్టించే విధంగా తెలుగుదేశం పార్టీ బహిరంగ సభ విజయవంతం కావడం ప్రతిపక్షాల్లో గుబులు పుట్టిందని ఈ సందర్భంగా కొనియాడారు.తర్వత ప్రభుత్వ ఆసుపత్రి లో బ్రెడ్ అరటిపండు ఇవ్వడం జరిగిందని డోర్నకల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి ధరావత్వకటేష్ నాయక్ అన్నారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల నాయకులు వీరస్వామి కురవి మండలం అధ్యక్షుడు, షేక్ నాభి, లింగయ్య,ఉపేందర్, నగేష్,సురేష్,విజయ్ టిడిపి కార్యకర్తలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.




