Wednesday, 4 November 2026

ఘనంగా ఎన్టీ రామారావు జయంతి వేడుకలు.

మల్కాజిగిరి.జనంసాక్షి.మే28
తెలుగు ప్రజల అభ్యున్నతి కోసం తెలుగు దేశం పార్టీని స్థాపించి రాజకీయాలలో నూతన శకానికి నాంది పలికి ప్రజల నిరాజ నాన్ని అందుకున్న సాటి లేని మేటి దిగ్గజం నందమూరి తారక రామారావు ఆయన పేరు చరిత్ర లో చిరస్థాయిగ నిలిచి పోతుందని తెలుగు దేశం పార్టీ మల్కాజిగిరి నియోజకవర్గ కిర్డినేటర్లు వగ్గు చంద్ర శేఖర్ రావు,కరణం గోపి పేర్కొన్నారు.తెలుగుదేశం పార్టీ వ్యవస్థాప కులు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు 100వ జయంతి(శత జయంతి)సందర్భంగా సఫిల్ గూడా చౌరస్తా,మౌలాలి లోని ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలవేసి కేక్ కట్ చేసి పండ్ల పంపిణీ కార్యక్రమం చేసి ఘనంగా నివాళులు అర్పించరు అనంతరం వెంకటాపురం గొల్లగూడ కమాన్ దగ్గర ఎన్టీఆర్ చిత్ర పటానికి పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది ఈ కార్యక్రమం సురేష్ కుమార్ సింగ్,గొల్లగూడ శ్రీనివాస్,గుంటి భీంరాజ్,రమేష్, నాగమణి,నరసమ్మ,విజయలక్ష్మి, లలితా చౌదరి,బుర్ర రాజు గౌడ్, మాల్యాద్రి,భాస్కరాచారి,సోమశేఖర్, సుమన్,యాదగిరి,సుధాకర్,సుందర్, లక్ష్మణ్,ఈశ్వర్,మధు,వరుణ్,రాజయ్య, శ్రీనివాస్,రత్నభూషణ్,రవి తదితరులు పాల్గొన్నారు.