గద్వాల నడిగడ్డ, మే 28 (జనం సాక్షి);జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ఎంఏఎల్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 1995- 98 బిఏ డిగ్రీ బ్యాచ్ పూర్వ విద్యార్థులు ఆదివారము సమావేశము నిర్వహించారు. 25 సంవత్సరాల సిల్వర్ జూబ్లీ పూర్తయిన సందర్భంగా పూర్వ విద్యార్థులందరూ ఎం ఏ ఎల్ డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో ఘనంగా ఆత్మీయతను పంచుకోవడం జరిగిందనీ, వివిధ ప్రభుత్వ ఉద్యోగాలలో టీచర్లుగా లెక్చరర్లుగా వివిధ రంగాలలో ఉద్యోగాలు చేస్తున్నానారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీపతి నాయుడు, తమకు విద్యను బోధించిన గురువులు రాజశేఖర్ తెలుగు అధ్యాపకులు, పొలిటికల్ సైన్స్ అధ్యాపకులు సుధాకర్ పబ్బతి, రాములు వీరితోపాటు పూర్వ విద్యార్థులు కలీముల్లా, సుదర్శన్ శెట్టి,త్రిపాఠి, దామోదర్, సత్య ప్రకాష్, ఫణిందర్ రెడ్డి, రజని, పుష్ప,, శ్రీదేవి, అర్పిత, రామకృష్ణ శ్రీనివాసులు, మొదలైన మిత్రులు కలుసుకొని తమ పూర్వ వైభవాన్ని చాటుకున్నామని, తము ఈ కళాశాలలో విద్యార్థుల దశలోని జ్ఞాపకాలను, గుర్తులను నెమరు వేసుకున్నట్లువారు ఆన్నారు.




