Thursday, 5 November 2026

శ్రీ అభయ బస్వేశ్వర స్వామి నూతన ఆభరణాల అలంకరణ మహోత్సవ వేడుకలో పాల్గొన్న

శ్రీ అభయ బస్వేశ్వర స్వామి నూతన ఆభరణాల అలంకరణ మహోత్సవ వేడుకలో పాల్గొన్న.
పోచారం సురేందర్ రెడ్డి

కోటగిరి డిసెంబర్ 6 జనం సాక్షి:-కోటగిరి మండల కేంద్రంలోని పోచారం కాలనీలో కొలువైన శ్రీ అభయ బస్వేశ్వర స్వామివారి నూతన ఆభరణాల అలంకరణ మహోత్సవ వేడుకలు మంగళవారం కన్నుల విందుగా కొనసాగింది.ఈ అభరణాల అలంకరణ మహోత్సవంలో బాన్సువాడ నియోజక వర్గ తెరాస పార్టీ ఇంచార్జీ పోచారం సురేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ఆలయంలో నిర్వహించిన హోమం,పూజాది కార్యక్రమాలతో పాటుగా స్వామి వారికి చేయించిన నూతన వెండి,రాగి నాగభరణాల ను ఆయన భక్తుల సమక్షంలో స్వామివారికి అలంక రించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.
గ్రామంలోని దాతల సహకారంతో స్వామి వారికి చేయించిన వెండి,రాగి నాగంభరణాలను నా చేతుల మీదుగా అలంకరించడం సంతోషంగా ఉందన్నారు. ఈ ఆభరణాల అలంకరణ మహోత్సవానికి స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి రావాల్సింది ఉండగా వారు కొన్ని కారణాల రీత్యా రాలేకపోయారన్నారు.ఈ నూతన ఆలయ నిర్మాణానికి ఎండోల్ మెంట్ శాఖ ద్వారా 20 లక్షల నిధులను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మంజూరు చేయించడం జరిగిందన్నారు.ఇందు లో భాగంగా ఎండోల్మెంట్ శాఖ వారికి చెల్లించాల్సిన 20% ఫండ్ అనగా 4 లక్షలలో ఆలయ అభివృద్ధి పనుల నిర్మాణంలో భాగంగా పోచారం కుటుంబ సభ్యుల తరుపున లక్ష రూపాయలను విరాళంగా స్వామి వారికి ప్రకటిస్తున్నానని అన్నారు.అలాగే ఆలయ కాంపౌండ్ వాల్ నిర్మాణం పనుల కోసం ఎస్డిఎఫ్ ఫండ్ నుండి ఐదు లక్షల రూపాయలు స్పీకర్ మంజూరు చేశారన్నారు.అనంతరం ఆలయ కమిటీ సభ్యులు పోచారం సురేందర్ రెడ్డికి పూలమాల,శాలువ,స్వామివారి మెమెంటోతో సత్కరించారు.తదనంతరం ఆలయ ఆవరణంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.ఈ కార్యక్రమం లో స్థానిక ప్రజా ప్రతినిధులు,ఆలయ కమిటీ సభ్యులు,భక్తులు తదితరులు పాల్గొన్నారు.