నెన్నెల, మే 31, (జనంసాక్షి )బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య జన్మదిన వేడుకలు బుధవారం నెన్నెల మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. మండల పరిషత్ కార్యాలయం ఎదుట కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈకార్యక్రమంలో ఎంపీపీ సంతోషం రమాదేవి, సింగల్ విండో చైర్మన్ మేకల మల్లేష్, మండల బీఆరెస్ పార్టీ అధ్యక్షుడు పంజాల విద్యా సాగర్ గౌడ్, నెన్నెల ఎంపీటీసీ పురంశెట్టి తిరుపతి, మండల కో అప్షన్ సభ్యుడు ఇబ్రహీం, ఆత్మ చైర్మన్ సున్నం రాజు, సర్పంచులు బోయిని మల్లేష్, గొర్లపల్లి బాపు, కంకణాల తిరుపతి రెడ్డి, బోర్లకుంట శివ ప్రసాద్, ఎనుక మల్లయ్య, నాయకులు సింగతి రాంచందర్, సంతోషం ప్రతాప్ రెడ్డి, చీర్ల మొండన్న, మసూద్ ఖాన్, కామెర శ్రీనివాస్, బత్తిని వెంకటేష్ గౌడ్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఘనంగా ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య జన్మదిన వేడుకలు.




