జనంసాక్షి, మంథని : జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా ముఖ్యమంత్రి కెసిఆర్ నిండు నూరేళ్లు ఆయురా రోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ఉండాలని కాటారం మండలంలోని ఆంజనేయ స్వామి ఆలయంలో “సుదర్శన నరసింహ యాగం” నిర్వహించనున్నట్లు బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కాటారం పిఎసిఎస్ చైర్మన్ చల్ల నారాయణరెడ్డి తెలిపారు. కెసిఆర్ భారత ప్రధాని కావాలని, మంథని నియోజకవర్గ ప్రజలందరు సుఖసంతోషాలతో ఉండాలని యాగం నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. బుధవారం మంథని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… కెసిఆర్ నాయకత్వంలో భారతదేశంలోనే ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టి దేశంలోనే అభివృద్ధిలో మొదటి స్థానంలో ఉంచారు. కెసిఆర్ ప్రభుత్వం భారతదేశంలోనే ఎక్కడ లేని విధంగా ” శతాబ్దిలో జరగలేని అభివృద్ధిని దశాబ్దిలో” చేసి చూపించారు. జూన్ 2వ తేదీ నుండి 22వరకు వరకే జరిగే దశాబ్ది ఉత్సవాలలో భాగంగా మంథని నియోజకవర్గంలో ప్రతి ఒక్క ప్రజా ప్రజాప్రతినిధులు, కార్యాకర్తలు, అధికారులు అంత మమేకమై సంక్షేమ పథకాలను ప్రజలందరికి చేరవేయాలి. గ్రూప్స్ కి ప్రేపరషన్ అయ్యే విద్యార్థులందరికి గ్రూప్ 2,3,4కి ప్రిపేర్ అయ్యే విద్యార్థులందరికి జూన్ 25వ తేదీన మంథని నియోజకవర్గం కేంద్రంలో 40సంవత్సరాల అనుభవం ఉన్న అధ్యాపకులతో మోడల్ పేపర్ తయారు చేపించి “మోడల్ టెస్ట్”ఎగ్జామ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో రామగిరి మండల ఎంపీపీ అరెల్లి దేవక్క-కొమురయ్య గౌడ్, ఇబ్రహీంపల్లి గ్రామ సర్పంచ్ డబ్బేట సరోజన-రాజేష్, కాటారం మండల మాజీ జడ్పీటీసీ దుర్గం మల్లయ్య, మాజీ మండల అధ్యక్షులు డోలి అర్జయ్య, ఇబ్రహీంపల్లి గ్రామ వార్డ్ మెంబర్ మంతెన చిరంజీవి,అనుమాలా రమేష్,గోగుల రాజేష్, పులి గౌతమ్ తదితరులు ఉన్నారు.
జూన్ 2న ఆంజనేయ స్వామి ఆలయంలో “సుదర్శన నరసింహ యాగం”




