Monday, 2 November 2026

నేత్రదానం మహాదానం – సదాశయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సంస్మరణ సభ

జనంసాక్షి, మంథని : పెద్దపల్లి జిల్లా మంథని మండలం లక్కెపూర్ గ్రామానికి చెందిన ఊరగొండ రాజయ్య(70) అనే సింగరేణి రిటైర్డ్ కార్మికుడు 21-5-23 న అనారోగ్యంతో మృతి చెందగా రాజయ్య నేత్రాలను సమాజ హితం కోసం నేత్ర దానం చేశారు. ఈ రోజు వారి స్వగృహంలొ నేత్ర దాత సంస్మరణ సభ సదాశయ బాద్యులు సురేష్ ఆధ్వర్యంలో నిర్వహించి, వచ్చిన బంధు మిత్రులకు నేత్ర దానం పై అవగాహనా కల్పించి కుటుంబ సభ్యులు ఇంటి పెద్దదిక్కుకు కోల్పోయిన దుఃఖంలో కూడా, మరో ఇద్దరు అంధులకు వెలుగులు ప్రసాదించడాని మృతుని భార్య సత్తమ్మ, కొడుకులు మల్లేష్, సంపత్, కూతుళ్ళు రజిత, వనిత, సునీత, కొడళ్లు సరోజన, కవిత, అల్లుళ్లు ఓదెలు, రవీందర్, రమేశ్ కుటుంబ సభ్యులు శంకర్, రాయమల్లు, శివ, రాజును అభినందించి వారికి అభినందన జ్యాపిక ను అందజేశారు. నేత్రదాత కుటుంబ సభ్యులను సదాశయ ఫౌండేషన్ అధ్యక్ష, కార్యదర్శులు టి.శ్రవణ్ కుమార్, లింగమూర్తి, నూక రమేశ్, భీష్మాచారి, చంద్రమౌళి, కే.ఎస్.వాసు, రామగుండం లయన్స్ క్లబ్ ప్రతినిధి బెణిగోపాల్ త్రివేది, రాజేందర్ అభినందించారు.