.బెల్లంపల్లి, మే 31, (జనంసాక్షి )బెల్లంపల్లి నియోజకవర్గంలో బుధవారం బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గ పరిధిలోని బెల్లంపల్లి, తాండూర్, కాసిపేట్, నెన్నెల, బిమిని కన్నెపల్లి, వేమనపల్లి మండల కేంద్రాల్లో కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. రోగులకు పండ్లు పంపిణీ చేశారు. బెల్లంపల్లి పట్టణంలో మున్సిపల్ చైర్ పర్సన్ జక్కుల శ్వేతా – శ్రీధర్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ సిబ్బంది, కార్మికులకు అన్నదానం చేశారు. అనాధ శరణాలయంలో ఎమ్మెల్యే చిన్నయ్య దంపతులు అనాధ పిల్లలతో కలిసి సహా పంక్తి భోజనం చేశారు. నియోజకవర్గ పరిధిలోని ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు ఎమ్మెల్యేను కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
ఘనంగా ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య జన్మదిన వేడుకలు




