Monday, 2 November 2026

పిచ్చి మొక్కల తొలగింపు

 జనంసాక్షి, కమాన్ పూర్ : పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండలం జూలపల్లి గ్రామంలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా జూలపల్లి పెద్ద చెరువుకు వెళ్లే దారికి ఇరువైపులా ఉన్న చెట్లను, అలాగే ఎల్లమ్మ గుడి పరిసరాల్లో ఉన్న పిచ్చి మొక్కలను కూలీల సాయంతో తొలగించారు. ఈ పనులను కమాన్పూర్ ఎం పి ఓ శేషయ్య సూరి, జూలపల్లి సర్పంచ్ బోల్లపల్లి శంకర్ గౌడ్ లు పరిశీలించారు.