Sunday, 8 November 2026

ఘనంగా ఎమ్మెల్సీ జన్మదిన వేడుకలు.

ఘనంగా ఎమ్మెల్సీ జన్మదిన వేడుకలు.
ఫొటో : రోగులకు పండ్లు, బ్రెడ్ అందజేస్తున్న ఎంపీపీ.
నెన్నెల, డిసెంబర్ 22, (జనంసాక్షి )
నెన్నెల మండల కేంద్రంలో గురువారం ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ దండే విఠల్ జన్మదిన వేడుకలు ఎంపీపీ సంతోషం రమాదేవి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పాలు, బ్రెడ్, పండ్లు పంపిణీ చేశారు. ఈకార్యక్రమంలో వైస్ ఎంపీపీ గురునాదం సుమలత ప్రేమ్ సాగర్ గౌడ్, మండల కో అప్షన్ సభ్యుడు ఇబ్రహీం, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు అశోక్ గౌడ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ తోట మధు, నాయకులు దుర్గం మల్లేష్, రమేష్, గణపతి, కృష్ణ, భాస్కర్, జీవన్ తదితరులు పాల్గొన్నారు