బచ్చన్నపేట ఏప్రిల్ (జనం సాక్షి)జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలోని బండనగరం గ్రామంలో కుమ్మరి కులస్తుల ఆరాధ్య దైవమైన శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవంలో భాగంగా వేద పండితులచే హోమం కార్యక్రమం నిర్వహించారు హోమం కార్యక్రమంలో కులస్తులంతా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారుఉదయం 9 గంటలకు గణపతి పూజ. ఏక లింగతో భద్ర మండప ఆరాధన. అగ్ని ప్రతిష్ట. గణపతి నవగ్రహ మండప స్థాపిత దేవత నామ మంత్రి పుష్పం హారతి. అనంతరం తీర్థప్రసాద వితరణ. సాయంత్రం 6 గంటలకు జలది వాసం హారతి. ఈ కార్యక్రమంలో బండనగరం గ్రామ ప్రజలు ఆలయ కమిటీ పెద్దలు కుల పెద్దలు కుమ్మరి కులస్తులు పాల్గొన్నారు.




