Tuesday, 3 November 2026

మనువాదాన్ని మట్టు పెడదాం భారత రాజ్యాంగాన్ని రక్షించుకుందాం 

 

 

 

 

 

 

 

వరంగల్ ఈస్ట్, ఏప్రిల్ 28 (జనం సాక్షి)వరంగల్ జిల్లా సామాజిక ప్రజాసంఘాల ఆధ్వర్యంలో  పూలే అంబేద్కర్ జన జాతర శంభునిపేట జీకే లక్ష్మి కన్వెన్షన్ హాల్ లో కెవిపిఎస్ వరంగల్ జిల్లా కార్యదర్శి ఆరూరి కుమార్ అధ్యక్షతన ఘనంగా జరిగింది, ఈ కార్యక్రమానికిముఖ్యఅతిథిగా కెవిపిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్ బాబు హాజరై  మాట్లాడుతూ  మనువాద పాలకుల విధానాలతో అంబేద్కర్ ఆశయాలు సమాధి చేయబడుతున్నాయని దేశంలో మెజారిటీ ప్రజలను చదువు సంపదలకి ఆస్తులు ఆభరణాలకి దూరం చేసినా మనువాదం మానవాళి మనుగడకే పెను ప్రమాదమని అంబేద్కర్ పట్ల భక్తి పెరగటం కంటే అంబేద్కర్ భావజాలం విస్తరించడం నేటి సమాజానికి ఎంతో అవసరం  ఉందన్నారు దేశంలో కుల వ్యవస్థకు కుల వివక్ష అంటరానితనం పుట్టుకకు ప్రధాన కారణమైనదనీ మనుధర్మశాస్త్రమని, మామూలు ప్రజలకు మనుధర్మ శాస్త్రం లోదాగి ఉన్న మర్మాన్ని విప్పి చెప్పాలని, మనం మనుధర్మ శాస్త్రాన్ని మట్టుపెట్టాలని,బహిర్గతం చేయాలని అన్నారు. రాజ్యాంగాన్ని రక్షించుకోవడం మన బాధ్యత అన్నారు. బిజెపి అధికారంలోకి వచ్చినప్పుడల్లా రాజ్యాంగం  రిజర్వేషన్లు రద్దు వంటి దుశ్చర్యలకు తెరలేపుతుందన్నారు అంబేద్కర్ విగ్రహాలే కాదు అంబేద్కర్ విధానాలు దేశానికి ప్రపంచానికి ఎంతో అవసరమని చెప్పారుఈ కార్యక్రమంలోవరంగల్ జిల్లా దళిత గిరిజన బీసీ మైనార్టీ సంఘాల నాయకులు హాజరై మాట్లాడినారు మరియు కళాకారుల ఆటపాట, ప్రసంగాలు ఉత్తేజ బరితంగా సాగాయి జన జాతర విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ప్రత్యేక ధన్యవాదాలు, తెలిపిన ఆరూరి కుమార్ ఈ కార్యక్రమంలో సిహెచ్ రంగయ్య,  ఏం సాగర్, హనుమకొండ ఆనంద్, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తరాల సందీప్, భారతీయ బౌద్ధ మహాసభ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ బొమ్మల అంబేద్కర్, ఎమ్మార్పీఎస్ జిల్లా ఇన్చార్జ్ బిర్రు మహేందర్, సాంబమూర్తి  ఉసిల్ల కుమార్, దాసరపు అనిల్, రహీం, చల్ల మల్లయ్య, దుర్గయ్య, మధుకర్, ఎల్లయ్య, యడల రవీందర్, ఆవుల ఉదయ్, పాల రవికుమార్, అక్కనపల్లి యాదగిరి, కేడల ప్రసాద్, సామాజిక ప్రజా సంఘాలు మరియు ప్రజలు  పాల్గొన్నారు