స్వాతంత్రం తెచ్చింది.. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్
– ఘనంగా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు..
– కాంగ్రెస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ ఆరిఫ్.
ఊరుకొండ, డిసెంబర్ 28 (జనంసాక్షి):
భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీ.. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని కాంగ్రెస్ టౌన్ ప్రెసిడెంట్ ఆరిఫ్ అన్నారు. బుధవారం ఊరుకొండ మండల కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో కాంగ్రెస్ పార్టీ138వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కాంగ్రెస్ మండల పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ జెండా ఎగురవేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆరిఫ్ మాట్లాడుతూ పేద ప్రజల శ్రేయస్సు కొరకు నిరంతరం పాటుపడే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, రానున్న కాలంలో దేశంలో మల్లికార్జున కరిగే గారి ఆధ్వర్యంలో మరియు రాష్ట్రంలో పిసిసి అధ్యక్షులు ఎనుముల రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అధికారకంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అయూబ్ పాషా, శ్రీనివాసులు, వీరస్వామి, కృష్ణయ్య, జడ్చర్ల అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ సెక్రటరీ దార బంగారయ్య, సేవాదళ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుబ్బ యాదయ్య, ఊరుకొండ మండల యూత్ ప్రెసిడెంట్ విజయుడు, మనోహర్ రెడ్డి, ధార రాజు, జంగయ్య, దయాకర్, మధు, చంద్రయ్య, అమీర్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.
స్వాతంత్రం తెచ్చింది.. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్




