Saturday, 7 November 2026

ఘనంగా ఎస్ ఎఫ్ ఐ 53వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

ఘనంగా ఎస్ ఎఫ్ ఐ 53వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
* ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు గార్లపాటి పవన్ కుమార్

టేకులపల్లి, డిసెంబర్ 27 (జనం సాక్షి ): మండల కేంద్రంలో ఎస్ఎఫ్ఐ 53వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను మంగళవారం ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు గార్లపాటి పవన్ కుమార్ జండా ఆవిష్కరించి ఈ సందర్భంగా మాట్లాడుతూ 1970 డిసెంబర్ 27 నుండి 31 వ తేదీలో కేరళ రాష్ట్రం త్రివేండ్రం అనే ప్రాంతంలో అధ్యయనం పోరాటం అనే నినాదంతో స్వతంత్రం, ప్రజాస్వామ్యం, సోషలిజం అనే లక్ష్యాలతో 11 మంది సభ్యులతో ఏర్పడి 53 ఏళ్ల విద్యార్థి ఉద్యమంలో ప్రస్తుతం కోటి మంది సభ్యులతో ఉన్నా ఏకైక విద్యార్థి సంఘం ఎస్ఎఫ్ఐ అని అన్నారు. 53 ఏళ్ల కాలంలో విద్యార్థుల పక్షాన ఉంటూ అనేక విద్యార్థి ఉద్యమ పోరాటాలు అనేక నిర్వహించిన సంఘం ఎస్ఎఫ్ఐ అని అన్నారు. చాలామంది విద్యార్థుల నాయకులని కోల్పోయి, ఎన్నో నిర్బంధనలు ఎదుర్కొంటూ ఓర్వలేని వ్యక్తులు దాడులు చేస్తున్నప్పటికీ, ఎక్కడ కూడా వెనక్కి తగ్గకుండా నిత్యం విద్యార్థుల పక్షాన ఉంటూ అనేక రూపాల్లో భవిష్యత్తు విద్యారంగానికి కొట్లాడుతుందని అన్నారు. మా దేహాలు ముక్కలైన కానీ,ఈ దేశాన్ని ముక్కలు కానివ్వం అని నినాదంతో ముందడుగు వేస్తున్నారని అన్నారు. రాబోయే రోజుల్లో కూడా మన రాష్ట్రంలో స్కాలర్షిప్, ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వక అనేకమంది విద్యార్థులు నిత్యం మధ్యలోనే విద్యను ఆపే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. స్కాలర్ షిప్లు వచ్చేదాకా విద్యార్థి ఉద్యమాలు నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. జూనియర్ కళాశాలలో పోరాటం నిర్వహిస్తామని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన జాతీయ విద్యా విధానాన్ని 53 ఏళ్ల ఎస్ఎఫ్ఐ విద్యార్థి ఉద్యమ స్ఫూర్తితో తరిమికొట్టే దాకా పోరాడుతామన