మూడు మండలాల అంగన్వాడి టీచర్లకు అవగాహన శిక్షణ
టేకులపల్లి,డిసెంబర్ 27( జనం సాక్షి ): టేకులపల్లి, గుండాల, ఆళ్లపల్లి అంగన్వాడీ టీచర్లకు మండల పరిధిలోని ముత్యాలంపాడు క్రాస్ రోడ్ లో గల రైతు వేదిక భవనంలో మంగళవారం టేకులపల్లి సిడిపిఓ కే మంగతార ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు నిర్వహించారు. దశల వారీగా అభ్యాసన విధానంలో కొల ప్రమాణం ప్రకారం(ILA madule )-11,12.గురించి మూడు మండలాలైన టేకులపల్లి, గుండాల, ఆళ్లపల్లి అంగన్వాడీ టీచర్స్ కి శిక్షణ తరగతులు నిర్వహించడం జరిగింది. ఈ శిక్షణ కార్యక్రమంలో ఏ సి డి పి ఓ కే అరుణ కుమారి హాజరై అంగన్వాడి టీచర్లకు అవగాహన కల్పిస్తూ బలహీన నావజాత శిశువు ను గుర్తించడం ఎలా? వారిని రక్షించడం ఎలా? అదనపు ఆహారం సరైన సమయం లో మొదలు పెట్టారా (6)నెలలు నిండిన బిడ్డ కు నిర్దారించుకోవడం. తల్లులకు కుటుంబ సభ్యులకు అవగాహనా కల్పించాలని, దీని వల్ల బరువు తక్కువ పిల్లలు, పోషణ లోపం తో బాధపడే పిల్లలు లేకుండా అందరు ఆరోగ్యావంతమైన పిల్లలు ఉండాలన్న లక్ష్యం తో ఉండాలనే ఉద్దేశంతో శిక్షణ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలోటేకులపల్లి,గుండాల,ఆళ్లపల్లిమండలాల సూపెర్వైజర్స్ ఎం రోజా, కె అనురాధ, కె సక్కుబాయ్, జి.లక్ష్మి, కె. విజకుమారి, కె. యశోదమ్మ, బి. నిర్మల, ఎండి , ఖలీదా భేగం, జి స్వరాజ్యలక్ష్మి,పోషణభియాన్ బిసి. యు. నాగిరెడ్డి పాల్గొన్నారు.




