సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ.
కోటగిరి డిసెంబర్ 27 జనం సాక్షి:-ఉమ్మడి కోటగిరి మండలానికి చెందిన 8 మందికి ముఖ్యమంత్రి సహాయనిధి ఆర్థిక సాయం చెక్కులను వర్ని మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మంగళవారం పంపిణీ చేశారు.రూ 800928 నగదు చెక్కులను లబ్ధిదారులకు స్పీకర్ అందజేశారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ కోటగిరి మండల అధ్యక్షులు ఎజాస్ ఖాన్, మార్కెట్ కమిటీ చైర్మన్ అబ్దుల్ అమీద్,వైస్ ఎంపీపీ వల్లేపల్లి శ్రీనివాస్ రావు,మండల రైతుబంధు అద్యక్షులు కొల్లూర్ కిషోర్,సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులు,వర్ని మండల ప్రజా ప్రతినిధులు,నాయకులు పాల్గొన్నారు




