Wednesday, 4 November 2026

ఘనంగా ఓటర్ దినోత్సవం పాల్గొన్న తహసిల్దార్

*
మెట్పల్లి టౌన్, జనవరి 25,
జనంసాక్షి :
మెట్పల్లి పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఓటర్ దినోత్సవం సందర్భంగా తహసిల్దార్ నడిమెట్ల సత్యనారాయణ ఆధ్వర్యంలో పలువురి సీనియర్ ఓటర్ల ను ఘనంగా సన్మానం చేశారు.
ఈ సందర్భంగా తహసిల్దార్ మాట్లాడుతూ దేశ భవిష్యత్తు కు ఓటు హక్కు ప్రథమమనీ, ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఓటు హక్కును పొందాలని 18 సంవత్సరాల నిండిన వారు ఓటర్ ఐడిని అంగన్వాడి కేంద్రాలలో మరియు ఆర్పీల వద్ద నమోదు చేసుకోవాలని ఓటు హక్కు ప్రతి ఒక్కరూ దేశ భవిష్యత్తు కోసం రాబోయే తరాలకు అభివృద్ధి కోసం మనం ఎన్నుకునే నిజాయితీ నాయకులపై ఉంటుందని, అందుకే నిజాయితీగా ఓటు వేసి నిజాయితీగా ఉన్న నాయకులకు స్వచ్ఛందంగా తప్పకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలని దేశ భవిష్యత్తుకు పూనాది కాగలరని, కావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బిఎల్ఓ రాష్ట్ర అధ్యక్షురాలు నజీమాబేగం, ప్రిన్సిపాల్ వెంకటేశ్,సీనియర్ ఓటర్స్, రిటైర్డ్ ఉపాధ్యాయులు గండ్ర ఆనంద్,నాయకులు ఎండి షాకీర్ ఆర్పీలు,విద్యార్థిని విద్యార్థులు సీనియర్ ఉపాధ్యాయులు ఓటర్లు తదితరులు పాల్గొన్నారు.