Wednesday, 4 November 2026

ముఖ్యమంత్రి దత్తత గ్రామంలో అభివృద్ధి మొదలు

యదాద్రిజిల్లా తుర్కపల్లి మండలం జనంసాక్షి న్యూస్ జనవరి25/23/
గ్రామపంచాయతీ భవనంతోనే గ్రామ అభివృద్ధి మొదలు..ఫోటో రైట్ అప్ 02తుర్కపల్లి నూతన గ్రామపంచాయతీ భవనానికి శంకుస్థాపన చేస్తున్న దృశ్యం.ముఖ్యమంత్రి దత్తత గ్రామమైన వాసాలమర్రిలో గ్రామపంచాయతీ నూతన భవన శంకుస్థాపనతోనే గ్రామ అభివృద్ధి మొదలైందని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రమేల సత్పతి లు అన్నారు.బుధవారం తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామంలో నూతన గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ పంచాయితీ భవన శంకుస్థాపనతో మొదలైన పనులు అంచలు అంచలుగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు అభివృద్ధి పనులు జరుగుతాయని అన్నారు.ఇట్టి భవన నిర్మాణానికి 30 లక్షల వ్యయంతో నిర్మిస్తున్నట్లు తెలిపారు. గ్రామంలో లేఅవుట్ ప్రకారంగా ఇండ్ల నిర్మాణములో ఖాళీ స్థలాలు నష్టపోయిన వారికి 289 సర్వే నెంబర్లు 11 ఎకరాల్లో నష్టపోయిన వారికి స్థలాలను ఇస్తున్నట్టు తెలిపారు. గ్రామ అభివృద్ధికి ప్రజలందరూ సహకరించాలని కోరారు. కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం గ్రామ అభివృద్ధి అన్ని విధాలుగా జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారి, ఎంపీపీ భూక్యాశుశీల రవీందర్ నాయక్, జెడ్పి వైస్ చైర్మన్ బిక్కు నాయక్, సర్పంచ్ పోగుల ఆంజనేయులు, ఎంపీటీసీ పలుగుల నవీన్ కుమార్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ,మండల స్పెషల్ ఆఫీసర్ జినుకల శ్యాంసుందర్, డిపిఓ సునంద ,పిఎసిఎస్ చైర్మన్ సింగిరెడ్డి నరసింహారెడ్డి ,వైస్ ఎంపీపీ మహాదేవుని శ్రీనివాస్, టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు పి న్నపరెడ్డి నరేందర్ రెడ్డి ,ఎంపీటీసీ గిద్దె కరుణాకర్, డిఈ వెంకటేశ్వర్లు, ఎంపీడీవో మానే ఉమాదేవి, ఎంపీ ఓ వెంకటేశ్వర్లు ,పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ ,ఏఎంసి డైరెక్టర్ బద్ధు నాయక్, పిఎసిఎస్ డైరెక్టర్ కోండ్ర ముత్యాలు, అధికారులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.