Wednesday, 4 November 2026

పార్టీ బలోపేతానికి అందరు కృషి చేయాలి వట్టిపల్లి శ్రీనివాస్ గౌడ్

యదాద్రిజిల్లా తుర్కపల్లి మండలం జనంసాక్షి న్యూస్ జనవరి25/23.ఫోటో రైట్ అప్ 01తుర్కపల్లి సమావేశంలో మాట్లాడుతున్న వట్టిపల్లి శ్రీనివాస్ గౌడ్బిజెపి పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని బిజెపి స్టేషన్ గన్ పూర్ పాలక్ వట్టిపల్లి శ్రీనివాస్ గౌడ్ అన్నారుబుధవారం తుర్కపల్లి మండల కేంద్రంలోని బిజెపి మండల పార్టీ అధ్యక్షుడు కొక్కొండ లక్ష్మీనారాయణ గౌడ్ అధ్యక్షతన కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టిఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలులో పూర్తిగా విఫలమైందని అన్నారు . నియోజకవర్గంలోని గంధ మల్ల ప్రాజెక్టును మరిచారని అన్నారు. బిఆర్ఎస్ అవినీతి పాలన అంతం కావాలని కోరారు. నరేంద్ర మోడీ పాలన దేశంలోనే ఆదర్శవంతంగా ఉందని అన్నారు. కేంద్రం రాష్ట్రానికి అనేక రకాల స్కీములు ఇస్తుందని అన్నారు. భూముల్లో,బొగ్గులో,ఇసుకలో, పథకాలలో కెసిఆర్ అవినీతి పాలన సాగిస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి మాటల మనిషే కానీ చేతల మనిషి కాదని ఎద్దేవా చేశారు. రాక్షస పాలన సాగిస్తున్నారని అన్నారు. రైతుబంధు కాకుండా రైతు బతికే పంటలను చూపిస్తే రైతుబంధుపై ఆధారపడకుండా రైతులు బ్రతుకుతారని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి డొంకెన రాజు గౌడ్, జిల్లా కార్యవర్గ సభ్యులు ఆకుల సైదులు, మండల ప్రధాన కార్యదర్శిలు మేకల శ్రీనివాస్, పెండెం నరసింహులు, గిరిజన మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి మాడోత్ రమేష్ నాయక్, కిసాన్ మోర్చా జిల్లా కార్యదర్శి బొల్లు నరసింహ యాదవ్, కర్రెరాజు కుమార్ గౌడ్, గొర్ల రామచంద్రం ,షేక్ చాంద్ పాషా,గూగుల్ నరసింహ నాయక్, మేకల పాండు, పిడుగు లక్ష్మయ్య ,నాగరాజు ,భాస్కర్, రాము, కందుకూరి వేణు ,బాలేష్ తదితరులు పాల్గొన్నారు.