Wednesday, 4 November 2026

ఘనంగా కనకదుర్గ అమ్మవారి ఆలయంలో పూజలు

ఘనంగా కనకదుర్గ అమ్మవారి ఆలయంలో పూజలు – అన్నదానంలో పాల్గొన్న ఎమ్మెల్యే హుజూర్ నగర్ డిసెంబర్ 7 (జనంసాక్షి): హుజూర్ నగర్ పట్టణంలోని కనకదుర్గ దేవాలయంలో శాఖంబరి ఉత్సవాలు శనివారం ఘనంగా నిర్వహించారు. దేవాలయ ప్రాంగణంలో జరిగిన మహ అన్నదాన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా స్థానిక శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి హాజరై అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించినారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సైదిరెడ్డి మాట్లాడుతూ ఎంతో మహిమ ఉన్న కనకదుర్గ అమ్మవారి కృప భక్తులందరి మీద ఉండాలని, హుజూర్ నగర్ పట్టణ ప్రజలు సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. పట్టణ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు చిట్యాల అమర్నాథ్ రెడ్డి, స్థానిక కౌన్సిలర్ గుండా ఫణి కుమారిరాంరెడ్డి, దేవాలయ కమిటీ సభ్యులు బాచిమంచి కొండయ్య లు అడిగిన వెంటనే దేవాలయం వెనుక భాగంలో ఉన్న కళ్యాణ మండపానికి 5 లక్షల రూపాయలు మంజూరు చేయించడంపట్ల దేవాలయ కమిటీ వారు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నరిగిరినాధుని రంగ భట్టాచార్యులు, కొట్టు రాము, కౌన్సిలర్స్ దోంగరి మంగమ్మ, ములకలపల్లి రామ్ గోపి, ఎడ్ల విజయ్, మహిళా కమిటీ అధ్యక్షురాలు దొంతి రెడ్డి పద్మ, మీసాల కిరణ్ కుమార్, కోలపూడి చంటి, స్వామి, ప్రదీప్, అమ్రోజు నాగరాజు, జడ అంజి తదితరులు పాల్గొన్నారు.