Wednesday, 4 November 2026

వ్యర్థ పదార్థాలను వదిలి తగులబెట్టుతున్న పరిశ్రమల పై చర్యలు తీసుకోవాలి

వ్యర్థ పదార్థాలను వదిలి తగులబెట్టుతున్న పరిశ్రమల పై చర్యలు తీసుకోవాలి

జహీరాబాద్ మండలంలో గల వివిధ గ్రామాల శివారులలో పరిశ్రమలోని వ్యర్థ పదార్థాలను పారవేసి తగలబెడుతున్నా పరిశ్రమ యాజమాన్యం పై చర్యలను తీసుకోవాలని మాజీ కౌన్సిలర్ రాములు నేత డిమాండ్ చేశారు. శనివారం మండల సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే మాణి క్ రావు కు కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
జహీరాబాద్ మండలంలో గల పరిశ్రమలోని వ్యర్థ పదార్థాలను జహీరాబాద్ మండలంలో గల వివిధ గ్రామాల శివారులలో పారవేసి తగలబెడుతున్నారు ఇలా తగలబెట్టే వివిధ పదార్థాలలో ముఖ్యంగా ఫైబర్ వస్తువులు ఉంటున్నాయి ఫైబర్ వస్తువులను తగలబెట్టగా వచ్చే పొగ నుండి విపరీతమైన దుర్వాసన రావడంతో ఇక్కడి ప్రాంతంలో గల సీతాకోకచిలుకలు తుమ్మెదలు, కందిరీగలు తేనీగలు వలస వెళ్లి మన ప్రాంతంలోని పంట పొలాలలో పంటలు కూడా సరిగా పండక పోవడం జరుగుతుంది వాస్తవానికి ఇలాంటి క్రిమికి కీటకాలు ఉండడంతోని పంటల పైన వాలడంతో పరాక్రమ సంపర్కం జరిగి విత్తనోత్పత్తి జరిగే అవకాశం ఉంటుంది ఒకవేళ ఇలాంటి క్రిమి కీటకాలు లేకపోవడంతోని అవి వలస వెళ్లినట్లయితే ఈ ప్రాంతంలో ఎంత దట్టంగా పొదల్లాగా పంటలు పెరిగిన పరాక్రమ సంపర్కం జరగక వితనూత్పత్తి కాక పంటల దిగుబడి రాలేక చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.