ఘనంగా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
మహబూబాబాద్ బ్యూరో-డిసెంబర్28(జనంసాక్షి)
బడుగు బలహీన వర్గాల సంక్షేమం కొరకు అనేక పథకాలను ప్రవేశపెట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కిందని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ధనియాకుల రామారావు పేర్కొన్నారు. మహబూబాబాద్ జిల్లా గార్ల మండల కేంద్రంలోని స్థానిక నెహ్రూ సెంటర్ కూడలిలో బుధవారం కాంగ్రెస్ పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ 138 ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తోలుత కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు దనియాకుల రామారావు జాతీయ కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం కేకును కట్ చేసి కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల స్థాయిలో పార్టీ బలోపేతానికి తమ వంతు కృషి చేస్తామని, తెలంగాణ రాష్ట్ర టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని ఆయన పేర్కొన్నారు. అలాగే మండలంలోని యువకులందరూ పార్టీ బలోపేతానికి కలిసి రావాలని తెలిపారు. ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో తాళ్లపల్లి కృష్ణ గౌడ్, ముల్కనూరు ఎంపీటీసీ మాలోతు వెంకట్ లాల్, సీతంపేట ఎంపీటీసీ నాగమణి, కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు శంషాద్ బేగం, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మండా రాము గౌడ్, చిలకబాబు, గుగులోత్ శ్రీనివాస్, జవ్వాజి శ్రీనివాస్, వశ్యా నాయక్, ఎద్దు రవి, సురేష్, బీమా నాయక్, విఠల్ నాయక్, కోటేష్, శ్రీనివాస్ యాదవ్, వినోద, జనార్ధన్, దీకొండ రాము, పర్తియా నాయక్, చిన్నా తదితరులు పాల్గొన్నారు




