Wednesday, 4 November 2026

ఘనంగా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం

ఘనంగా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం
వేములవాడ, డిసెంబర్ 28(జనం సాక్షి): వేములవాడ పట్టణంలోని అంబేద్కర్ కూడలి వద్ద పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ 138 వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు సాగారం వెంకటస్వామి పార్టీ జెండాను ఎగురవేసి అనంతరం మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ వల్లనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిందని, దేశం, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేసి దేశ అభివృద్ధికి తోడ్పడాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు చిలక రమేష్, కూరగాయల కొమరయ్య, పాత సత్యలక్ష్మి, మూడుగె చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు