ఘనంగా కాకా వెంకటస్వామి వర్ధంతి.
ఫొటో : నివాళులు అర్పిస్తున్న నాయకులు.
బెల్లంపల్లి, డిసెంబర్ 22, (జనంసాక్షి )
బెల్లంపల్లి పట్టణంలో గురువారం కేంద్ర మాజీ మంత్రి కాకా గడ్డం వెంకటస్వామి తొమ్మిదవ వర్ధంతి వేడుకలను బీజేపీ, కాంగ్రెస్ పార్టీల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వెంకటస్వామి విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. కాకా సేవా సమితి ఆధ్వర్యంలో అంబేడ్కర్ చౌరస్తాలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ స్వర్గీయ కాకా వెంకటస్వామి బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి కోసం విశేషంగా కృషి చేసిన మహనీయుడని అన్నారు. కార్మికుల హక్కుల కోసం పార్లమెంటులో ఎన్నో పోరాటాలు చేసి కార్మిక హక్కులు కల్పించారని, సింగరేణి కార్మికులకు భవిష్య నిధి, పింఛన్ కాకా వెంకటస్వామి ఘనతే అన్నారు. ఈకార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మునిమంద రమేష్, పట్టణ అధ్యక్షుడు కోడి రమేష్, కాంగ్రెస్ నాయకులు మాజీ మున్సిపల్ చైర్మన్ సూరిబాబు, గెల్లి జయరాం, ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఘనంగా కాకా వెంకటస్వామి వర్ధంతి.




