మైనార్టీ రుణాలకు దరఖాస్తు ఆహ్వానం.
ఎంపీడీవో మారుతి
కోటగిరి డిసెంబర్ 23 జనం సాక్షి:-రాయితీ రుణాలపై ఆసక్తి ఉన్న మైనారిటీ నిరుద్యోగ యువత వెబ్ సైట్ ద్వారా రుణాలకు దరఖాస్తు చేసుకోవాలని కోటగిరి మండల ఎంపీడీవో మారుతి గురువారం పత్రిక ప్రకటన ద్వారా అభ్యర్థులకు కోరారు.ఆసక్తి గలవారు ఆన్లైన్ సెంటర్ ని సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.21-53 వయస్కులై,ఆధార్,వైట్ రేషన్ కార్డ్,లక్షన్నర వార్షిక ఆదాయం కలవారు ఈ మైనార్టీ రుణాలకు అర్హులని తెలిపారు.ఈ దరఖాస్తు ప్రక్రియ ఈనెల19 నుండి ప్రారంభమై,2023 జనవరి 5 వరకు కొనసాగుతుందన్నారు.మైనార్టీ లోన్స్ కు సంబంధించి రెండు క్యాటగిరీలుగా విభజించడమైనది,కేటగిరి 1కి లక్ష రూపాయలు,కేటగిరి 2కి రెండు లక్షల రుణాలకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.ఆసక్తి గల అభ్యర్థులకు ఏదేమైనా సందేహాలు ఉన్నచో కోటగిరి ఎంపీడీవో కార్యాలయానికి సంప్రదించగలరని ఈ సందర్భంగా ఆయన కోరారు.




